కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఇంకా వ్యాక్సిన్ కనుగొనబడని ఈ వ్యాధి అమాంతం ప్రాణాలని బలి తీసుకుంటుంది. ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరించిన ఈ వ్యాధి తన కోరల్ని మరింత విస్తృతం చేసింది. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న దేశాలు సైతం ఈ మహమ్మారిని తట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలందరూ తీవ్ర అవస్థలకి గురి చేస్తోంది.

 

 

ప్రజలందరినీ తీవ్ర అవస్థలకి గురి చేస్తోన్న ఈ సందర్భంలో ఒక్కో దేశం కరోనా నుండి బయటపడడానికి పెద్ద యుద్ధమే చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ చైనా కంటే ఎక్కువగా వేరే దేశాలని వణికిస్తోంది. కరోనా బారినుండి చైనా మెల్లమెల్లగా కోలుకుంటుంది. కానీ ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని తమ పౌరుల ప్రాణాలని రక్షించలేకపోతున్నాయి. కరోనా కారణంగా భారతదేశమంతటా ఏప్రిల్ 14 వ తేది వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

దీంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఒక ఊరు దాటి మరో ఊరు వెళ్లడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇలాంటి టైమ్ లో ఉత్పత్తొ పూర్తిగా దెబ్బతింది. ఆర్థికంగా పూర్తిగా కుదేలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాని ఎదిరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ప్రభుత్వానికి అండగా పలువురు సెలెబ్రిటీలు సాయం చేస్తున్నారు. మొన్న టాలీవుడ్ హీరో నితిన్ రెండు తెలుగు రాష్ట్రాలని ఇరవై లక్షల సాయం చేయగా, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలకి కోటి రూపాయల విరాళం ప్రకటించాడు.

 

ఒక్కో తెలుగు రాష్ట్రానికి యాభై లక్షల చొప్పున కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి అత్యవసర నిధికి ఇస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. కరోనాని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి సాయం చేస్తున్న సెలెబ్రిటీలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

 

 

https://twitter.com/PawanKalyan/status/1243023427750875138

మరింత సమాచారం తెలుసుకోండి: