చిరంజీవి దగ్గర నుండి మహేష్ ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ లు ఇప్పటివరకు కేవలం కరోనా గురించి జాగ్రత్తలు చెపుతూ రోజులు కొనసాగిస్తూ ఉంటే సీనియర్ హీరోలు వెంకటేష్ నాగార్జున బాలకృష్ణలు కనీసం ఈ సమస్య గురించి ఒక్క మాట కూడ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడు మౌన ముద్రను కొనసాగించే పవన్ కళ్యాణ్ కరోనా సమస్య పై యుద్ధం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెరొక 50 లక్షలు విరాళంగా ఇచ్చి తన పెద్దమనసు చాటుకోవడంతో పవన్ అభిమానులు జోష్ లో ఉన్నారు. 


ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తన సందేశాలతో కాలం గడుపుతూ ఉంటే పవన్ మాత్రం క్రియా రూపంగా ఆర్ధిక సహాయం చేయడం ఒకవిధంగా చిరంజీవిని ఇరుకున పెట్టే విషయం. దీనితో చిరంజీవి పవన్ ఇచ్చిన మొత్తం కన్నా పెద్ద మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 


దీనికితోడు  క్రికెట్ టీమ్ ను తలపించే మెగా యంగ్ హీరోలు కూడ పవన్ బాటను అనుసరించ వలసిన ఒత్తిడి ఏర్పడింది. ఇండస్ట్రీకి సంబంధించి పెద్దగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విషయంలోనూ తల దూర్చడు. అయితే చిరంజీవి మాత్రం ఇండస్ట్రీ పెద్దగా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులలో పవన్ విరాళం పై చిరంజీవి స్పందన ఎలా ఉంటుంది అన్న కోణంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


గతంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎన్టీఆర్ ఎ ఎన్ ఆర్ ల తరువాత సూపర్ స్టార్ కృష్ణ భారీ మొత్తాలను సహాయం చేసేవాడు. ఇప్పుడు కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మహేష్ కూడ పవన్ విరాళంతో తన స్థాయిలో స్పందించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సినిమాకు 20 కోట్లకు పైగా పారితోషికాలు తీసుకునే టాప్ యంగ్ హీరోలు ప్రజలు ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలకు తమవంతు సహాయం చేయకపోతే వారందర్నీ తప్పుపట్టే స్థాయిలో పరిస్థితులు మారిపోతాయి. దీనితో పవన్ భారీ విరాళం టాప్ హీరోలకు ఊహించని సమస్య తెచ్చి పెట్టింది అనుకోవాలి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: