కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా.. తెలుగు ఇండస్ట్రీ కదలి వస్తుంది.   యంగ్ హీరో నితిన్ సీఎం కేసీఆర్ ని కలిసి పదిలక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇక రాజశేఖర్ జీవిత దంపతులు సినీ కార్మికుల కోసం తమ వంతు సహాయం అందించారు.  పవన్ కళ్యాన్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి చెలో రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు.  డైరెక్టర్ వివివినాయక్ నిన్న ఐదు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.  ఇలా సినీ స్టార్లు, ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు తమ వంతు సహాయం అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు ఇస్తున్నారు త్రివిక్రమ్.  అయితే ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విటర్ ద్వారా ప్రకటించారు. `కరోనాపై పోరాటానికి సహాయపడే క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధులకు రూ.పది లక్షల చొప్పున విరాళం అందించాలని మా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నార`ని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశాన్ని కరోనా పట్టి పీడిస్తుంది.. దీన్ని ప్రతి ఒక్కరూ నిర్మూలించడానికి తమ వంతు కృషి చేయాలని అన్నారు.

 

ఇప్పుడు సీఎం సహాయ నిధికి ఒక్కో నటుడు,దర్శక, నిర్మాతలు ముందు రావడం సంతోషించాల్సిన విషయం అని అంటున్నారు.  ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది.. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.  కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఏ మరణాలు సంబవించలేదు.. విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ కరోనా ఎఫెక్ట్ ఉందని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం తెలుగురాష్ట్రాలు లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని అంటున్నారు. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: