ప్రస్తతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పై ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నాయి. అయితే సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తే ఈ మహమ్మారిని మరింత వేగవంతంగా తరిమికొట్టవచ్చని పలువురు ప్రముఖులు, డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఆ విధంగానే ప్రధాని మోడీ మొత్తం 21 రోజులు పాటు మన దేశాన్ని లాకౌట్ ప్రకటించారు. ఇక మరోవైపు ఈ మహమ్మారి వలన లాకౌట్ ప్రకటించడంతో పలువురు మధ్యతరగతి, పెద్ద వర్గాల వారు పనులు లేక, తినడానికి తిండి లేక పలు రకాల సమస్యలు ఎదుర్కోవడంతో ప్రభుత్వం కూడా అటువంటి వారికి ఉచితంగా రేషన్ సరుకులు, కొంత మొత్తంలో ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించింది. 

 

ఇక ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎప్పుడూ తమ వంతుగా ముందుండే సినిమా పరిశ్రమ, ఈ విపత్కర సమయంలో కూడా వారికి అండగా ఉంటూ పలువురు సినిమా ప్రముఖులు తమకు వీలైనంత సాయాన్ని ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా సినిమా నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నేడు రూ.50 లక్షలు చొప్పున ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కు గాను, అలానే మరొక రూ.1 కోటి రూపాయలను పీఎం రిలీఫ్ ఫండ్ కు గాను విరాళం ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు. 

 

అయితే ఆయన ప్రకటించిన ఈ సాయం పై పలువురు ప్రజలు, ప్రముఖులు ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాసేపటి క్రితం దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా పవన్ సాయాన్ని అభినందించిన హరీష్, పవన్ సినిమా ఎంట్రీ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇంక సినిమాలెందుకు అని అనకండి, కొంతమందికి సినిమా అవసరం, ఇంకొంతమంది సినిమాకి అవసరం అంటూ హరీష్ తన పోస్ట్ ద్వారా తెలిపారు. ఇక ప్రస్తుతం హరీష్ చేసిన ఆ ట్వీట్, పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: