టాలీవుడ్ లో ఇప్పుడు దర్శకులైనా, హీరోలైనా, నిర్మాతలైనా సరే హిట్ సినిమాలు చేయాలని చూస్తున్నారు. సినిమా కథ ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు చూసే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారాన్ని నమ్ముకుని సినిమాలను జనాల్లోకి తీసుకువెళ్లాలి అని  ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ లో దర్శకులందరూ కూడా ఒక సమస్య తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. తమ ప్రతిభ ను పక్కనపెట్టి సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యే విధంగా కథలు రాసుకుంటున్నారు.

 

 గతంలో రచయితలు ఇచ్చిన కథల ను ఎక్కువగా నమ్ముకునే దర్శకులు ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మార్చేశారు. తమ కథలను తామే రాసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరో లు కూడా ఇప్పుడు అలాంటి కథలే ఎక్కువగా నమ్ముతున్నారు. కమర్షియల్ కోణం లో ఉండే సినిమాల మీద ఉన్న పిచ్చి సినిమా కథ బలంగా ఉన్న వాటి మీద ఉండటం లేదు. దీనితో కమర్షియల్ గా సినిమా హిట్ అయితే దర్శకుడు నిర్మాత ని అయినా సరే నమ్మే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మాత్రం ఆ దర్శకుడికి ఎంత ప్రతిభ ఉన్నా సరే పక్కన పెడుతున్నారు. క్రిష్ అలాగే హరీష్ శంకర్ లాంటి దర్శకులు ఒకప్పుడు మంచి హిట్ లు కొట్టారు.

 

 కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు ఉండటంతో వారిని నిర్మాతలు పక్కన పెట్టేస్తున్నారు. దర్శకుడి మీద నమ్మకం ఉంటే మినహా పెద్దగా సినిమాలు చేసే పరిస్థితి కూడా లేదని అర్థమవుతుంది. దీనితో దర్శకులు కథలు రాసుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. తమను తాము నిరూపించుకోవడం కంటే సినిమా కమర్షియల్ గా తీర్చిదిద్దితే చాలు అనే భావన లో దర్శకు లు ఉన్నారు. రాజమౌళి అలాగే ఒకరిద్దరు దర్శకులు మినహా పెద్దగా ఎవరూ కూడా కథలను నమ్ముకునే పరిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: