అందం అరక్షణమే. వయసైతే పాదరసమే. ఎంత వేగంగా కరిగిపోతుందో తెలిసే లోగానే మొత్తం కధ ముగుస్తుంది. అందుకే సినిమా తారలకు వయసు బాధ ఎక్కువ. వయసు చెప్పకుండానే నెట్టుకొస్తూంటారు. ఎప్పటికీ పదహారు అంటూ తమను తామే కాక అందరినీ మభ్యపెడుతూంటారు. ఎంత చేసినా కూడా దాగని వయసు అలా ఒక్కసారిగా  ఫేడౌట్ చేసేస్తుంది.

 

సరే కాలం గడిస్తే ఆ గొడవ వేరు. కానీ ఇరవైలో అరవై ఎవరూ కోరుకోరు. కానీ చూస్తూంటే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ జాతకాన్ని మాత్రం టాలీవుడ్ డైరెక్టర్లే మార్చేసి  ఆమెను ఇపుడు మూలన కూర్చోబెట్టారట. హాటీగా ఉండాల్సిన ఈ బ్యూటీని ఆంటీని చేశారని తీరిగ్గా కూర్చుని మధన పడుతోంది.

 

ఆమె వెంకీమామ మూవీలో ఈ మధ్య చేసింది. అందులో సీనియర్ యాక్టర్ వెంకటేష్ పెయిర్ గా చేసింది. ఆ మూవీలో మరో హీరో నాగ చైతన్య ఉన్నాడు. అతని సరసన రాశీఖన్నా చేసింది. రాశీఖన్నా ఏజ్ ఉన్న పాయల్ మాత్రం అత్త క్యారక్టర్లో కనిపిస్తుంది. ఈ మూవీ విషయంలో డైరెక్టర్ బాబీ తనకు అన్యాయం చేశాడని పాయల్ ఇపుడు పెద్ద కంప్లైంటే చేస్తోంది.

 

తనను ఏకంగా ఆంటీగా చూపించారని, రాశీ ఖన్నా కంటే ముదురుగా మేకప్ తో చూపించారని అంటోంది. దాని వల్ల మొత్తం యంగ్ హీరోల మూవీస్ లో తాను చాయిస్ కాకుండా పోయాయని ఆమె అంటోంది. ఇక వరసగా సీనియర్ హీరోల నుంచే తనకు ఆఫర్లు రావడం పట్ల కూడా ఈ అమ్మడు హీటెక్కిపోతోంది.  

 

ఈ మధ్యనే బాలయ్య, బోయపాటి మూవీలో పాయల్ ని సెలెక్ట్ చేశారని న్యూస్ రావడంతో ఖండించేసింది. మరి ఆ బాధలోనే ఆమె ఇపుడు బాబీ మీద మండిపడుతోంది అంటున్నారు. తనకు వయసు సొగసు ఉన్నా కూడా అంటీని చేయడం వల్లనే ఇలా జరుగుతోందని ఫైర్ అవుతోంది. మరి ఈ ఆంటీ ట్యాగ్ పోగొట్టుకోవడానికి పాయల్ ఏ మంత్రం వేస్తుందో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: