పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని.. తనని అభిమానించే అభిమానుల్లో తాను ఒకడినని అంటున్నాడు కమెడియన్ ధన్ రాజ్. టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలని ప్రయాత్నించినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అడపాదడపా అవకాశాలతో కెరియర్ సాగిస్తున్నాడు ధన్ రాజ్. జబర్దస్త్ లో కొన్నాళ్ళు స్కిట్స్ తో అలరించిన ధన్ రాజ్ అది తనకు సూట్ అవదని భావించి బయటకు వచ్చాడు. లేటెస్ట్ గా నాగబాబు  మళ్ళీ బుల్లితెర మీద సందడి చేస్తున్నాడు ధన్ రాజ్. 

 

ఇక రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానమని అన్నాడు. అంతేకాదు పవన్ సినిమా ఛాన్స్ వస్తే నిమిషం ఆలోచించకుండా ఓకే చెబుతానని అంటున్నాడు ధన్ రాజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నాలుగు సినిమాల్లో చేశానని చెప్పిన ధన్ రాజ్ చిరుని చూసి హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని చెప్పారు. అప్పటికి ఇప్పటికి చిరంజీవి తనకు స్ఫూర్తి అని అటు మెగాస్టార్, ఇటు పవర్ స్టార్ ఇద్దరినీ కవర్ చేశాడు ధన్ రాజ్. మెగా ఫ్యాన్స్ దృష్టిలో పడాలంటే ఈమాత్రం చెప్పక తప్పదు. 

 

ధన్ రాజ్ సిని కెరియర్ అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఎలాగోలా నెట్టుకొస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కథనం సినిమాలో ధన్ రాజ్ కు మంచి పాత్ర పడ్డది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మళ్ళీ తన మార్క్ చూపించడానికి ప్రయత్నిస్తున్న ధన్ రాజ్ మంచి అవకాశం కోసం చూస్తున్నాడు. మెగా హీరోల భజన చేస్తున్నాడు కాబట్టి ఆ హీరోల దృష్టిలో పడి అవకాశాలు ఇస్తారేమో చూడాలి. మెగా ఫ్యామిలీ సినిమా లో ఛాన్స్ అంటే అది లక్కీ అన్నట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: