కరోనా వల్ల కొంత మంది స్టార్స్‌కి ఫుల్ ఖాళీ టైమ్ దొరికింది. అందులో షూటింగ్స్ క్యాన్సిల్ అవ్వడంతో అటు పనిలేక ఇటు బయటికెళ్ళేఛాన్స్ లేక ఇంట్లోనే టైమ్ పాస్ చేస్తున్నారు. అయితే ఈ హాలీడే పీరియడ్ లో పెద్దగా టైమ్ వేస్ట్ చెయ్యకుండా పెండింగ్ పనులు చేసేసుకుంటున్నారు స్టార్లు. మొన్నటి వరకూ షూటింగ్ లేకుండా ఉన్న బన్నీకూడా... సుకుమార్ సినిమా కోసం లుక్ టెస్ట్ లు చేస్తున్నాడు . స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫుల్ గా గడ్డాలు, మీసాలు పెంచి  డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నాడు అల్లు అర్జున్ . సో.. ఈ ఖాళీ టైమ్ లో వాటిని ఫైనలైజ్ చేసే పనిలోనే ఉన్నాడు  బన్నీ.

 

గద్దల కొండ గణేష్ సినిమాతో మంచి సక్సెస్ ని అకౌంట్ లో వేసుకున్న వరుణ్ తేజ్ కూడా కరోనా దెబ్బకి ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రజెంట్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కుతున్న సినిమాకు షూటింగ్ చేస్తున్న వరుణ్.. షూట్స్ క్యాన్సిల్ అవ్వడంతో బయటికెళ్లే ఛాన్స్ లేక ప్రాక్టీస్ ని ఇంట్లోనే పెట్టేసుకున్నాడు. ఇదే విషయాన్ని ఫోటో తో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు వరుణ్ తేజ్ .

 

రంగ్ దే సినిమాతో పాటు పెళ్లి పనుల్లో మొన్నీమద్య వరకూ బిజీగా ఉన్న నితిన్ కూడా ఇప్పుడు అన్నీ పోస్ట్ పోన్  చేసుకుని ఖాళీగా  ఉన్నాడు. ఇప్పటికే వరస పెట్టి సినిమాలు షూట్ చేస్తున్న నితిన్.. ఇప్పుడు నెక్ట్స్ సినిమా ఫైనల్ చెయ్యడానికి కథలు వింటున్నాడు.

 

ఇప్పటికే  స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. ఖాళీ టైమ్ ని అస్సలు వదలడం లేదు. బాగా వర్క్ మైండెడ్ గా ఉండే రష్మిక.. ఈ క్వారంటైన్ పీరియడ్ లో తెలివైన పని  చేస్తోంది. ఎవరి దగ్గరైనా స్టోరీలు ఉంటే తన మెయిల్ కి పంపించాలని.. అది  నచ్చితే.. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానని చెబుతోంది. ఖాళీగా ఉండడం ఎందుకు ఫ్యూచర్ ప్రాజెక్ట్ కోసమే ఇవన్నీ అని చెబుతోంది ఈ కన్నడ హీరోయిన్. ఇలా షూట్స్ క్యాన్సిల్ అయినా కూడా.. స్టార్లు అస్సలు టైమ్ వేస్ట్ చెయ్యకుండా తమ ఫ్యూచర్ కోసం ఫుల్ గా వాడేసుకుంటున్నారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: