కాజ‌ల్ ఫ‌స్ట్  ల‌క్ష్మీక‌ళ్యాణం చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన భామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. టాలీవుడ్‌, కోలీవుడ్ టాప్ స్టార్లంద‌రితోనూ న‌టించిన ఈ భామ హీరోయిన్‌గా మంచి రేంజ్‌లో ఉంది. ఇక ఈ భామ అటు బాలీవుడ్‌లోనూ స‌త్తా చాటాల‌ని ట్రై చేసింది. కానీ అక్క‌డ అనుకోకుండా  ఆశించినంత పేరు రాలేదు. అక్క‌డ కూడా త‌న మార్క్‌ని చూపించాల‌నుకుంది కానీ కుద‌ర‌లేదు.  తన కెరీర్ లో ఈ భామ ఏ హీరోతో కూడా ప్రేమ, ఎఫైర్ అంటూ షికార్లు చేసింది లేదు. ఎప్పుడూ కూడా ఎటువంటి రూమ‌ర్లు ఈ భామ పైన రాలేదు. అలాగే సహ జీవనాల జోలికి వెళ్లింది లేదు.

 

ప్రస్తుతం కేరీర్ చివరి దశకు చేరుకుంది కాజ‌ల్.  పెళ్లి చేసుకుని స్థిరపడిపోవడమే ఆలస్యం అనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌రో రెండు కొత్త చిత్రాలు ఈమెను వ‌రించాయి. ఒక‌టి చిరంజీవి చిత్రంలో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. అలాగే మ‌రో సినిమా కూడా ఈమెను వ‌రించిన‌ట్లు స‌మాచారం. అప్పట్లో ఓ బిజినెస్ మ్యాన్ తో లవ్ లో పడిందన్న రూమర్ ఒక్కటే అందరికీ తెలిసింది. కానీ అవన్ని రూమర్లేన‌ని అందులో ఎంత  మాత్రం నిజం లేద‌ని  తేలింది.  అయితే ఊహించని ఓ ఘటన మాత్రం కాజల్ కెరీర్ లో ఎప్పటికీ ఓ చేదు గుళికలా ఉండిపోయింద‌ని తెలిపింది. అప్పట్లో ఓ తమిళ సినిమా షూటింగ్ లో కాజల్ లైంగిక వేధింపులకు గురైనట్లు ఓ వార్త హల్ చల్ చేసిన విష‌యం తెలిసిందే. 

 


 ఓ స్టార్ హీరోతో కలిసి న‌టిస్తుండ‌గా సదరు హీరో తాగొచ్చి కాజల్ నడుమును గట్టిగా పట్టుకుని ఇబ్బందికి గురి చేసినట్లు కోలీవుడ్ సహా టాలీవుడ్ మీడియాలో కూడా ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో ప్ర‌చారం కొన‌సాగింది. వెబ్ సహా కొన్ని మెయిన్ స్ట్రీమ్ల‌లో సైతం అప్పట్లో ఈ న్యూస్ ని బాగా ఫోకస్ అయింది. అదే పనిగా సదరు హీరో కాజల్ నడుమును కావాలనే గట్టిగా పట్టుకుని విడిచి పెట్టలేదని తెలిసింది. చివరికి కాజల్ వ్యక్తిగత అసిస్టెంట్ ముందుకెళ్లి ఆ పిడికిలిని విడిపించాల్సొచ్చినంత ప‌నైంద‌ని ప్రచారం సాగింది. దాంతో ఆ షూటింగ్ మొత్తం కొన్ని నెల‌ల పాటు ఆగిపోయిన‌ట్ల తెలిసింది. 

 

ఇంత జ‌రిగిన‌ప్ప‌టికీ ఆ సినిమా ప్రచారంలో వీరిద్ద‌రూ కలిసి మ‌రీ ఆ సినిమాని ప్రచారం చేయడంతో వీరిద్ద‌రూ క‌లిసిపోయార‌ని అర్ధమైంది! అంటూ ప్రముఖంగా కథనాలొచ్చాయి. అయితే ఇటీవ‌లె వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం అవ‌న్నీకేవ‌లం రూమ‌ర్లే అని తెలిసింది.  ఏద‌న్నా కొంచం జ‌రిగితే చాలు దానికి ప‌దింత‌లు చేసి ప్ర‌చారం చేయ‌డం సోష‌ల్ మీడియాలో బాగా అల‌వాట‌యిపోయింది. కాజ‌ల్ విష‌యంలో కూడా అదే జ‌రిగింద‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెబుతున్నారు స‌ద‌రు మీడియా వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: