ప్రస్తుతం భారత దేశ వ్యాప్తిగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించిన విషయం తెలిసిందే.  అదే సాయంత్రం తెలుగు రాష్ట్రాలు మరికొన్ని రాష్ట్రాలు కలిపి లాక్ డౌన్ ప్రకటించాయి.  ఆ తర్వాత  దేశ వ్యాప్తంగా ప్రధాని లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ పై కొంత మంది సరైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపైకి రావడం వారిని పోలీసులు తమ లాఠీలతో ఝలిపించడం జరుగుతూనే ఉంది.  అయితే అత్యవసర పనులైతేనే బయటకు రావాలని అంటున్నా కొంత మంది ఆకతాయిలు రోడ్డు నిర్మాణుష్యంగా ఉంది.. ఎంజాయ్ చేయాలని.. లాంగ్ డ్రైవ్ చేయాలని పిచ్చి కరోరికలతో బయటకు వస్తున్నారు. 

 

ఇలాంటి కేసులు కొన్ని పోలీసులకు తారస పడ్డాయి.  మరికొంత మంది ఫ్యామిలీతో బయటకు రావడంతో వారికి చేతులెత్తి దండం పెడుతూ దయచేసి ఇంటి పట్టున ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు ట్విట్టర్ ద్వారా సూచనలు చేశాడు.  పోలీసులకు నా విన్నపం ఏమిటంటే... జనాలతో స్నేహపూర్వకంగా ఉన్నారో...  వాళ్లు మీ నెత్తినెక్కి కూర్చుంటారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాలో జోకులు వెల్లువెత్తుతున్నాయి. వీటిని చూస్తుంటే ఫ్రెడ్రిచ్ చెప్పిన ఒక కోట్ నాకు గుర్తుకొస్తోంది. ప్రపంచంలో ఎక్కువగా ఆందోళన చెందే జంతువు మనిషే.

 

భయంకరమైన వాస్తవాల నుంచి ఉపశమనం పొందేందుకు బలవంతంగా నవ్వులను పుట్టించుకుంటాడు. ఇలా తనదైన స్టైల్లో మరోసారి పోలీసులకు తన మంత్రం చెప్పకనే చెప్పినట్లు ఉందని అంటున్నారు కొంత మంది నెటిజన్లు. తన చిత్రాల్లో ఎప్పుడూ వైలెన్స్ నే ఎంకరేజ్ చేసే వర్మ ఇప్పుడు లాక్ డౌన్ పై కూడా తన నైజాన్ని ప్రదర్శిస్తున్నారని మరికొంత మంది నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా జనాల్లో మార్పు రావాలని కరోనాను అరికట్టడం అందరి సామాజిక బాధ్యత అంటున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple   

మరింత సమాచారం తెలుసుకోండి: