ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా భూతం పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే.  ఈ కరోనా మహమ్మారి భారిన  ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 21,295కి చేరింది. కరోనా పాజిటివ్ కేసులు 4,17,417 నమోదు అయ్యాయి. ఇటలీలో అత్యధికంగా 74,386 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,503 కరోనా మరణాలు సంభవించాయి. అమెరికాలో 68,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దారుణమైన విషయం ఏంటంటే.. స్పెయిన్‌లో ఒక్కరోజే 738 మంది మృతి చెందారు. కొన్ని దేశాల్లో కరోనాపై అప్రమత్తంగా లేని కారణంగానే బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఏంటే భారత దేశంలో ఆదివారం నుంచే లాక్ డౌన్ ప్రారంభం అయ్యింది. 

 

ఆదివారం జనతా కర్ప్యూ నిర్వహించిన తర్వాత అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  భారత ప్రధాని 24 నుంచి దేశం మొత్తం లాక్ డౌన్  ప్రకటించారు.  తాజాగా కరోనా మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు సైతం ముందుకొస్తున్నారు.  ఇప్పటికే పవన్ కళ్యాన్  ఆంధ్ర, తెలంగాణకు చెరో రూ.50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.  ఆయన బాటలోనే ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షలు చొప్పున దిల్ రాజు విరాళం ప్రకటించారు. డైరెక్టర్ కొరటాల శివ తెలుగు రాష్ట్రాల కోసం 5లక్షల సాయం అందించారు.

 

డైరెక్టర్ అనిల్ రావిపూడి రెండు తెలుగు రాష్ట్రాలకు గాను రూ. 5లక్షల విరాళం అందించారు. ఇక మహేష్ బాబు సైతం కోటి రూపాయలు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించారు. తాజాగా లాక్ డౌన్ ప్రభావంతో సర్వం నిలిచిపోయిన పరిస్థితుల్లో టాలీవుడ్ సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. దినసరి కూలీలు, అల్పాదాయ వర్గాలపైనే కాకుండా సినీ కార్మికులపైనా తీవ్ర ప్రభావం పడుతోందని చిరంజీవి ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీపై ఆధారపడిన సినీ కార్మికులకు రూ.1 కోటి విరాళం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: