ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సీట్ల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది కొంతకాలం క్రితం చాలా ఆసక్తిగా మారిన అంశం. రాజ్యసభకు వెళ్లడానికి వైసీపీ లో ఉన్న కీలక నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఏకంగా ఢిల్లీ నుంచి కూడా రికమండేషన్ చేయించుకునే విధంగా కొందరు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు.

 

 ఇక గత ఏడాది ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీలో చేరి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసి జగన్ కి అండగా నిలిచారు మోహన్ బాబు.  ఎన్నికల తర్వాత అంటే జగన్ ముఖ్యమంత్రి అయిన అనంతరం చిరంజీవి జగన్ కి పరోక్షంగా మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిలో ఒకరిని రాజ్యసభకు పంపిస్తారని అందరూ భావించారు. జగన్ కి కూడా వారితో అవసరం ఉండటం వల్ల కొన్ని వారిని రాజ్యసభకు పంపడం ఖాయమని అనుకున్నారు అందరు. మరి ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరిని రాజ్యసభకు పంపలేదు జగన్.

 

మంత్రులు పిల్లి సుభాష్  చంద్రబోస్ అలాగే మోపిదేవి వెంకటరమణ, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ముఖేష్ అంబానీ సూచించిన పరిమళ నత్వానీ లను రాజ్యసభకు పంపుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనితో అసహనం వ్యక్తం చేసిన చిరంజీవి రాజకీయాలతో తనకు ఉన్న సంబంధాలను పూర్తిగా తెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సీటు వస్తే క్రియాశీలకంగా వ్యవహరించాలని భావించారు చిరంజీవి. మరి ఏమైందో ఏమో తెలియదు గానీ ఇక రాజకీయాలు తనకు అవసరం లేదని తాను కోరిన పదవి తనకు దక్కలేదు కాబట్టి తనకు రాజకీయాలతో పని లేదని ఆయన ఇటీవల కొందరు సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: