టాలీవుడ్ లో నిన్నటి వరకు ఎంతో ఆశతో ఎదురు చూశారు మెగా, నందమూరి ఫ్యాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ఎప్పుడు వస్తుందా అని.. నిన్న ఉగాది పండుగ సందర్భంగా ‘రౌద్రం రణం రుధిరం’ అంటూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. శార్వరీ నామ సంవత్సర ప్రారంభం నాడు, 'ఆర్ఆర్ఆర్' అబ్రివేషన్ ను రివీల్ చేస్తూ  రాజమౌళి టైటిల్ ను ప్రకటించిన తరువాత ఎంతో మంది తమతమ శైలిలో కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఆర్.ఆర్.ఆర్ కి ఎన్నో టైటిల్స్ వచ్చాయి.. మొత్తానికి నిన్నటితో ఈ సస్పెన్స్ కి తెరపడింది. అంతా బాగుంది కానీ.. ఇప్పుడు ఈ మూవీ  టైటిల్  ‘రౌద్రం రణం రుధిరం’  టైటిల్ అంతరార్థం ఏంటా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

తాజాగా దర్శకుడు వీవీ వినాయక్ దీనిపై స్పందించారు. టైటిల్ లోని రౌద్రం, రణం, రుధిరం అంటే ఏంటో విశ్లేషించారు.  భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించి పోరాడటానికి కట్టలు తెంచుకున్నదే రౌద్రం.. వారిపై రణభేరి మోగించిన చేయాలనుకున్నది రణం.. ఆ యుద్ధంలో వాళ్లు అర్పించినది 'రుధిరం' అని ఆయన కామెంట్ చేశారు. వినాయక్ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మొత్తానికి రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ గా ‘రౌద్రం రణం రుధిరం’  మూవీ షూటింగ్ జరుగుతుంది.  

 

అయితే కరోనా వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నా షూటింగ్ విషయంలో ఆగే ప్రసక్తి లేదంటున్నారు రాజమౌళి. అనుకున్న సమయానికి ఈ మూవీ రిలీజ్ చేస్తామని అంటున్నారు.  ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, "ఒత్తిడిని పెంచే వార్తలు విరామం లేకుండా ఒకదాని తరువాత ఒకటి వినాల్సి వస్తున్న ఈ సమయంలో, రాబోయే మంచి విషయాల కోసం ఎదురుచూడాలని గుర్తు చేసిన రాజమౌళికి ధన్యవాదాలు. కొవిడ్-19 వంటి భయంకర వార్తలతో పాటు ఆర్ఆర్ఆర్ వంటి గొప్ప విషయాలు కూడా ఉన్నాయి" అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: