మిల్కీబ్యూటి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని హాట్ బ్యూటి  త‌మ‌న్నా భాటియా. ‘ఇప్పుడు తాను పూర్తిగా పరిణితి చెందానని, చాలా అనుభవం వ‌చ్చింద‌ని తమన్నా అంది. దీంతో ఆలోచనల్లోనూ మార్చు వచ్చిందని తమన్నా చెప్పింది. నా కెరీర్‌లో ఇన్నేళ్ళు సినీ పరిశ్రమలో రాణిస్తానని అస్సలు ఊహించలేదు. అయితే ఈ పదిహేనేళ్ళ‌ ప్రయాణం మాత్రం ఎంతో అత్యద్భుతంగా సాగింది. ప్రేక్షకుల ఆదరణే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’ అని అంటోంది తమన్నా. 2015లో ‘చాంద్‌ సా రోషన్‌ చెహ్రా’తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన‌ తమన్నా.. ‘శ్రీ’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ..తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాల్లో భిన్న పాత్రలు పోషించి శభాష్‌ అనిపించుకుంది. నటిగా అన్ని రకాల పాత్రలను నటించిందనే చెప్పవచ్చు. అందాలారబోతతో ప్రారంభించి తరువాత నటిగా తానేమిటో నిరూపించుకుంది.


 
కొత్తలోనూ మంచి చిత్రాలను ఎంపిక చేసుకుని నటించానని, ఇప్పుడూ అంతేనని తమన్నాచెప్పింది. సినిమాలకు వచ్చిన కొత్తలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు.. తీసుకునే నిర్ణయాలు కరెక్ట్‌గానే ఉంటాయి.. అని చెప్పింది. నటించడానికి వచ్చిన కొత్తలో ఏమైనా చేయాలనే ఆసక్తి ఉండేది… వయసలాంటిది. దీంతో వచ్చిన అవకాశాలన్నీ చేశానని చెప్పింది. అదీ తనకు మంచే అయ్యిందని, ఆ చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించిందని తమన్నా అంది. ఇప్పుడు తాను పూర్తిగా పరిణితి చెందానని, చాలా అనుభవం గడించానని అంది. దీంతో ఆలోచనల్లోనూ మార్చు వచ్చిందని తమన్నా చెప్పింది. ఆ అనుభవం ఇప్పుడు నటించే పాత్రలకు చాలా ఉపయోగపడుతోందని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే.. తానెప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని అంది.

 

‘మన జీవితంలో సక్సెస్‌, ఫెయిల్యూర్‌ రెండూ ఉండాలి. వాటిని బేరీజు వేసుకుని ముందుకు సాగాలి. చదువుకునే రోజుల్లో నేను మంచి స్టూడెంట్‌ని. సిన్సియర్‌గా స్కూల్‌కి వెళ్లేదాన్ని.‘ఓషో ది ట్రూ నేమ్‌’, ‘స్కిన్నీ బిట్చ్‌’ పుస్తకాలు నా జీవితాన్ని చాలా మార్చేశాయి.’స్కిన్నీ బిట్చ్‌’ పుస్తకం చదివాక మాంసాహారాన్ని వదిలి శాఖాహారిగా మారిపోయా. సినిమా రంగంలో నాకు చిన్నప్పట్నుంచి మాధురి దీక్షిత్‌, శ్రీదేవి, కరిష్మా కపూర్‌ అంటే ఇష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: