దేశంలో ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటికే పరిమితం అవుతున్నారు.  ప్రభుత్వాలు కూడా ఇదే చేయమని గట్టిగా చెబుతున్నారు. అత్యవసర పరిస్థితిలో అయితే  మాత్రమే బయటకు రావాలని.. అంత పర్యంతం అస్సలు బటయకు రావొద్దని చెబుతున్నారు.  మరి రెక్కాడితే కానీ డొక్కాడని వారి పరిస్థితి ఏంటా అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.   ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ మంచి మనసు చాటుకుంటున్నారు.  ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాన్, మహేష్ బాబు, రామ్ చరణ్ ఇతర నటులు, దర్శకులు, నిర్మాతలు విరాళాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత దేశం కష్టాల్లో ఉంది.. మీ వంతు సాయం అందించండి అంటూ ప్రతి ఒక్కరినీ కోరుతున్నారు. 

 

తాజాగా ప్రముఖ దర్శకులు ఈవివి సత్యనారాయన తనయుడు అల్లరి నరేష్ టాలీవుడ్ లో మంచి కమెడియన్ గా తన సత్తా చాటుతున్నారు. తాజాగా అల్లరి నరేష్ నటిస్తున్న నాంది మూవీ కరోనా వైరస్ ఎఫెక్ట్ తో వాయిదా పడిన విషయం తెలిసిందే.  లాక్ డౌన్ ప్రభావం సామాన్య, నిరుపేద కుటుంబాలపై ఆర్థికంగా ఎంతో చూపుతోంది. వారికి అండగా ఉండాలన్న తలంపుతో ఇప్పటికే  పలువురు సెలెబ్రిటీలు తమ ఉదారతను చాటుకుంటూ విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.  తాజాగా ‘అల్లరి’ నరేశ్ కూడా తన వంతుగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

 

అల్లరి నరేశ్ నటిస్తున్న కొత్త చిత్రం 'నాంది'. ఈ చిత్ర యూనిట్ లో రోజువారీ వేతనంతో జీవనం సాగించే కార్మికులకు ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు.   తమ నిర్మాత సతీశ్ వేగేశ్న, తాను కలిసి ఈ యాభై మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు.  ఈ సందర్బంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ... ఇది గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం.. ఈ సాయం కావాలి మరిన్ని సాయాలకు నాంది  అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: