కరోనా వైరస్ ప్రస్తుతం భూమి మీద ఉన్న ప్రజలందరి నోట వినబడుతున్న మాట. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ భూమిని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకి మానవజాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ వైరస్ ని కట్టడి చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు. అమెరికా మరియు స్పెయిన్ దేశాల భయంకరంగా విజృంభించు కుంటూ చాలా మందిని బలిగొంది. ఇటలీ దేశం విషయానికి వస్తే ఇంకా శవాల దిబ్బగా మారిపోయింది. చాలావరకు ఇటలీ ప్రభుత్వం మీద మా చేతుల్లో ఏమీ లేదు అంటూ చేతులెత్తేశారు. ఒక్క భారత్ మాత్రం ఒక యుద్ధం చేస్తుందని ప్రజలందరూ ఇంట్లో ఉండి తమ దేశాన్ని కాపాడుకుంటున్నారు అని అంతర్జాతీయ స్థాయిలో ఇండియాపై వార్తలు వస్తున్నాయి.

 

ప్రధాని మోడీ పిలుపుమేరకు లాక్ డౌన్ పగడ్బందీగా పాటిస్తే ఖచ్చితంగా కరోనా వైరస్ పై గెలవటం గ్యారెంటీ అని అంటున్నారు. అంతేకాకుండా మహామహులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు భారతీయులకు మధ్య ఉన్న ఐక్యమత్యం ప్రపంచానికి ఆదర్శమని దేశ ప్రజల పై పొగడ్తలు వర్షం కురిపించి కరోనా వైరస్ పై భారతీయులు విజయం సాధించాలని కోరుకుంటున్నారు. మరోపక్క చాలామంది దేశంలో ఉన్న ప్రముఖులు కరోనా వైరస్ వల్ల నష్టపోయిన పరిస్థితుల కోసం విరాళాలు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు.

 

విలక్షణ నటుడు కమలహాసన్ అయితే ఒకపక్క విరాళాలు ఇచ్చి మరోపక్క తన ఇంటిని ఆసుపత్రిగా వాడుకోవాలని తమిళనాడు ప్రభుత్వం దీనికి ఆదేశాలు ఇవ్వాలని సోషల్ మీడియాలో కోరారు. చాలా మంది హీరోలు డబ్బులు ప్రకటిస్తూ ఉంటే మాత్రం...కమలహాసన్ దాతృత్వంతో తన ఇంటిని ఆసుపత్రిగా కరోనా వైరస్ బాధితుల కోసం వాడుకోవచ్చని త్యాగం చేయడంతో సోషల్ మీడియాలో కమల్ హాసన్ చేసిన పని అందరికీ ఆదర్శమని అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: