కరోనా వైరస్ (కోవిడ్-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలను క‌మ్మేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో అన్నిరంగాలు దాదాపు స్తంభించిపోయాయి. ఇక‌ కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని పరిశ్రమలతో పాటే సినిమా ఇండస్ట్రీ కూడా ఇబ్బంది పడుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు..  అన్ని ఇండస్ట్రీస్‌కు సంబంధించిన పెద్ద సినిమాలు రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఏ సినిమాలు వాయిదా ప‌డ్డాయో ఓ లుక్కేసేయండి.

 

30 రోజుల్లో ప్రేమించడం ఎలా:  యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజుని హీరోగా ప‌రిచ‌యం చూస్తూ రూపొందుతున్న చిత్రం `30 నోజుల్లో ప్రేమించ‌డం ఎలా?`. ఎస్వీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్వీబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతోంది. క‌రోనా ఎఫెక్ట్‌తో మార్చ్ 25 నుంచి మరో డేట్‌కు పోస్ట్ పోన్ అయింది ఈ చిత్రం.

 

నిశ్శబ్ధం: ‘భాగమతి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న‌ అనుష్క చాలా రోజులు గ్యాప్ తీసుకొని నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. అనుష్క శెట్టితో పాటు ఈ సినిమాలో మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్, షాలినీ పాండే,అంజలి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎప్రిల్ 2న విడుదల కానుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం ఖ‌చ్చితంగా నెల రోజులు వాయిదా పడేలా తెలుస్తోంది.

 

నాని వి: నేచురల్ స్టార్ , సుధీర్ బాబు హీరోలుగా నటించిన చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని నెగెటివ్ షేడ్స్ ఉండే కిల్లర్ రోల్ చేస్తున్నాడని తెలియడంతో సినిమా మరింత ఆసక్తి రేగింది. అయితే మార్చి 25న ఉగాది శుభాకాంక్ష‌ల‌తో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావించినప్పటికీ, కోవిడ్ 19 కార‌ణంగా మూవీని ఏప్రిల్‌కి వాయిదా వేశారు.

 

రెడ్: ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం 'రెడ్‌స‌. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్రిల్ 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌తో ఇప్పుడు ఈ చిత్రం మే, జూన్‌కు వాయిదా పడేలా తెలుస్తోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple



మరింత సమాచారం తెలుసుకోండి: