రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా  తనకు ఎప్పటికి మర్చి పోలేని గిఫ్ట్ ఇస్తానని అంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో రేపు ఉదయం10 గంటలకు ఈ సినిమా నుండి రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన వీడియోను విడుదలచేయనున్నాని తారక్ కొద్దీ సేపటి క్రితం తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈవీడియో తెలుగు తోపాటు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది. 
 
 
ఇక నిన్నఉగాది సందర్బంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో తోపాటు మోషన్ పోస్టర్ ను విడుదలచేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రల ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈచిత్రంలో అలియా భట్ ,ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ చిత్రం విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: