మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ రౌద్రం రణం రుధిరం. రాజమౌళి దర్శకత్వంలో ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఉగాది సందర్భంగా నిన్న రిలీజ్ అయిన మూవీ టైటిల్, మోషన్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఇప్పుడు అభిమానులకు కిక్కెక్కించే మరో అద్భుతాన్ని రేపు ఇవ్వబోతోంది ఆర్ఆర్ఆర్ టీమ్. చరణ్ బర్త్ డే సందర్భంగా సినిమాలో చరణ్ లుక్ ను యూనిట్ రివీల్ చేయబోతోంది. స్టే ట్యూన్డ్ టు tarak9999 అని క్లియర్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

 

 

మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ మేరకు డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ నుంచి సోషల్ మీడియాలో అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. #Bheem for ramaraju అనే హ్యాష్ ట్యాగ్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది చిత్ర యూనిట్. దీంతో సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ లుక్ రివీల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం 10గంటలకు ఓ సర్ ప్రైజ్ వీడియో మీముందుకు రానుంది అని ప్రకటించింది. ఈ వీడియోను భీమ్ ఫర్ రామరాజు అని చెప్పడంతో రామ్ చరణ్ లుక్ ని ఎన్టీఆర్ రివీల్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

 

 

ఇప్పటికే విడుదలపైన టైటిల్ అండ్ మోషన్ వీడియోకు రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరి నుంచీ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా రాబోతున్న వీడియో ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. అనౌన్స్ మెంట్ జరిగిన పది పదిహేను నిముషాల్లోనే నెట్టింట్లో వైబ్స్ క్రియేట్ చేస్తోంది. మరి.. రేపటి వీడియోలో చరణ్ కు సంబంధించి ఎన్టీఆర్ రివీల్ చేయబోతున్న వీడియో మరెన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: