ప్రపంచ వ్యాప్తంగా కరోనా అత్యంత వేగంగా వ్యాపిస్తూ యావత్ ప్రజానికాన్ని హడలిస్తున్న నేపథ్యంలో 21 రోజులు పాటు ఎంతో కఠినంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు కారణం మన దేశంలో కరోనా సోకడంతో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 560 పైనే నమోదయ్యాయి. అంతేకాదు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోవడం ఎంతో బాధాకరం. 

 

ఇక ఈ కరోనా ఎఫెక్ట్ తోనే సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్స్ ని నిలిపి వేసి స్వీయ నిర్భంధం లో ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. నిజంగా ఇది సినిమా ఇండస్ట్రీకి ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. అంతే కాదు ఈ ఎఫెక్ట్ తో కొత్తగా నిర్మించబోయో సినిమాలని కొన్ని నెలలపాటు మొదలు పెట్టకుండా ఉంటే మంచిదని ఇండస్ట్రీ పెద్దలు సూచిస్తున్నారు.

 

ఇక మన టాలీవుడ్ లో చిన్న సినిమాల నుండి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ వరకు ఆని సినిమాల్ షూటింగ్ కి అర్ధాంతరంగా బ్రేక్ పడింది. ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ - బన్నీ కాంబినేషన్ లో మాస్ అండ్ యాక్షన్ ఎంటెర్టైనర్ తెరకెక్కుతుండగా ఈ సినిమా తాజా షెడ్యూల్ ని కేరళలో ప్లాన్ చేశారు. దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో కేరళ ఒకటి కావడంతో అక్కడ షూటింగ్ చేసే ప్లాన్స్ ని డ్రాపయ్యారట సుకూ టీం. ఈ నేపథ్యంలో అన్ని పరిస్థితులు మళ్ళీ చక్కబడే వరకు సుకుమార్సినిమా షూటింగ్ ని మొదలు పెట్టే ఆలోచనలో లేడని తెలుస్తుంది. దీనితో బన్నీ-సుకుమార్ ల సినిమా 2020లో రిలీజ్ అవడం అసాధ్యమని తెలుస్తుంది.  ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కి 20 వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటి రష్మిక మందన్న నటిస్తుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: