ప్రపంచం అంతా దయనీయ స్దితిలోకి మారిపోతుంది.. యుద్ధాలతో ప్రాణాలు పోయే రోజులు కావు ఇవి.. రోగాలతో నరకం అనుభవిస్తూ కంటికి కనిపించని క్రిములతో ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో తెలియని అయోమయంలో మరణం దరికి చేరే వారెందరినో చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి.. ఇన్నాళ్లూగా కష్టపడి సంపాదించిన వేల కోట్లు.. వచ్చే చావును ఆపలేకపోతున్నాయి.. ఖరీదైన కార్లు, పెద్దపెద్ద బంగళాలు విలాసవంతమైన జీవితం ఇవేవి కూడా రక్షణగా నిలవలేక పోతున్నాయి.. ఇలాంటి సమయంలో ఒకరికి ఒకరు ఆసరాగా చేయుతనిస్తూ ముందుకు సాగుతుంటే ఇలాంటి కష్టకాలంలో సైతం మనస్సు సంతోషంగా ఉంటుంది..

 

 

మనం చేసే సహాయం చిన్నదైనా, పెద్దదైనా ఒక మనిషి జీవించి ఉన్నంతకాలం పొందిన సహాయం ఎన్నటికి మరచిపోడు.. ఇకపోతే కరోనా వైరస్‌‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించడంతో సినీ పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోవడంతో ఎందరో సినీ కార్మికులు ఇప్పుడు ఆకలితో అలమటించే పరిస్దితులు తలెత్తాయి.. ఈ సందర్భంలో ఇలాంటి వారికి చేయుతనందించడానికి సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమవాళ్లకు అండగా తాము ఎప్పుడూ ఉంటామని నిరూపిస్తున్నారు. ఇప్పటికే సినీ కార్మికుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ఇప్పుడు అల్లరి నరేష్ కూడా తన వంతు సాయాన్ని ప్రకటించడానికి ముందుకు వచ్చారు..

 

 

ఇందులో భాగంగా తాను నటిస్తున్న  ‘నాంది’ అనే సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో ఈ చిత్రానికి పనిచేసే కార్మికులందరికీ సాయంగా నిలవాలని అల్లరి నరేష్, సతీష్ వేగేశ్న నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క కార్మికుడికి రూ.10 వేలు అందజేయనున్నట్టు ప్రకటించారు. ఇకపోతే ఈ చిత్రాన్ని దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు.. కాగా ఇలాంటి సమయంలో సిని పరిశ్రమకు సంబంధించిన పెద్దలు చేసే సహాయం చాలా గొప్పగా కీర్తించబడుతుంది.. ఇన్నాళ్లు వారు కూడబెట్టిన కోట్ల సంపాదనకు సార్ధకం చేకూరుతుంది.. తాను బ్రతుకుతే చాలు అని అనుకుంటున్న ఆలోచనల నుండి అందరు బ్రతకాలనే ఆశయం చాలా గొప్పది.. అందుకే టాలీవుడ్ పరిశ్రమలో ఉన్న ఏ ఒక్కరో ఇద్దరో చేతులు కలిపితే చాలదు.. అందరు కదలాలి.. మన చిత్రపరిశ్రమ ఐక్యతను చాటాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: