ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం`ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రం పై ప్రేక్ష‌కులు ఫుల్ క్రేజ్ మీద ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆయ‌న ఈ చిత్రానికి సంబంధించిన విష‌యాల‌ను అప్‌డేట్ ఇస్తాడా అని తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్ రాబోతోంది. గ‌త కొన్ని రోజులుగా అదిగో స‌ర్‌ప్రైజ్‌ ఇదుగో స‌ర్‌ప్రైజ్‌ అంటూ ఊరించి ఉడికించిన `ఆర్ ఆర్ ఆర్` టీమ్ ఈ ఉగాది రోజున ఫ‌స్ట్ లుక్ టైటిల్ లోగోతో పాటు మోష‌న్ పోస్ట‌ర్‌ని కూడా విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.  ఇక అది ఆడియ‌న్స్‌కి స‌ర్‌ప్రైజ్ గా  ఇచ్చారు.

 

1920 కాలం నాటి ఇండియా ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొంత క‌ల్పిత క‌థ‌ని జోడించి రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఒక‌రు ఉప్పెన, మ‌రొక‌రు నిప్పుక‌నిక‌లా ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల పాత్ర‌లు వుండ‌బోతున్న‌ట్టు టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌లో బ‌య‌ట‌పెట్టిన రాజ‌మౌళి రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజున మ‌రో స‌ర్‌ప్రైజ్‌ని ఇవ్వ‌బోతున్నార‌ట‌. శుక్ర‌వారం రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న  అల్లూరి సీతారామ‌రాజుకు సంబంధించి రామ్‌చ‌ర‌ణ్ లుక్‌ని రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ లుక్‌తో పాటు ఎన్టీఆర్‌కు సంబంధించిన కొమ‌రం భీం గెట‌ప్‌ని కూడా రివీల్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది.

 

రామ్‌చ‌ర‌ణ్ బ్రో నీ పుట్టిన రోజున‌ ఆనంద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో జ‌రుపుకోవాల‌ని కోరుకున్నాను. కానీ మ‌న‌మున్న ప‌రిస్థితుల్లో అది సాధ్యం కాదు కాబ‌ట్టి జాగ్ర‌త్త వ‌హించ‌క త‌ప్ప‌దు.  ఇప్పుడు లాక్ డౌన్ ప‌రిస్థితుల్లో వున్నాం. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అంతా ఇంట్లో వుండ‌టం ముఖ్యం. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు డిజిట‌ల్ వేదిక‌గా నీకు స‌ర్‌ప్రైజ్‌ ఇవ్వ‌బోతున్నాను. న‌న్ను న‌మ్ము. ఇది నీకు మ‌ర్చిపోలేని స‌ర్‌ప్రైజ్‌గా మిగిలిపోతుంది` అని త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసి దానికి #BheemforRamaraju అనే హ్యాష్ ట్యాగ్‌ని జ‌త చేశాడు. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: