మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ సినిమారంగంలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కెరీర్లో రెండో సినిమా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో కెరియర్ ని బాగానే లాక్కొచ్చి తండ్రి పేరు నిలబెట్టే విధంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మరో పక్క నిర్మాతగా రాణిస్తున్నాడు. చివరిగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో... ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న rrr ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున మెగా అభిమానులు ఈ పుట్టినరోజు వేడుకలు చేయాలని కరోనా వైరస్ రాకముందు చాలా ప్లాన్ వేశారు.

 

అయితే కరోనా వైరస్ రావటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 21 రోజులపాటు ప్రధాని మోడీ ప్రకటించడం జరిగింది. దీంతో మెగా అభిమానులు వేసుకున్న కార్యక్రమాలు అన్నీ రద్దు అయిపోయాయి. మరోపక్క అంతకుముందే రామ్ చరణ్ సోషల్ మీడియాలో తన జన్మదిన వేడుకలు ఎవరు చేయకూడదని చాలా ఖరాఖండీగా చెప్పడం జరిగింది. దీంతో ప్రస్తుతం అంతా ఇంటికి పరిమితం కావడంతో సోషల్ మీడియా లో ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈసారికి హ్యాష్‌ ట్యాగ్‌ తో జాతీయ స్థాయిలో ట్రెండ్‌ చేయాలని భావిస్తున్నారు.

 

మరోపక్క చరణ్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ విడుదల చేస్తారని భావించిన..ఉగాది పండుగ నాడు ఆర్‌ఆర్‌ఆర్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయడంతో.. రాజమౌళి సినిమా నుండి ఏదైనా విడుదల అవుతుందో అన్న దాని విషయంలో పెద్దగా నమ్మకం పెట్టుకోవడం లేదు రామ్ చరణ్ అభిమానులు. మొత్తం మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ కి భవిష్యత్ గురించి మాట్లాడుకుంటే rrr సినిమా హిట్ అవ్వడమే భవిష్యత్ అన్నట్టుగా ఉంది. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: