తాము రాణిస్తున్న రంగాల్లో తమ పిల్లలు ఎదిగి వారసులుగా నిలవాలని ఎవరైనా కోరుకుంటారు. అది వ్యాపారమైనా, రాజకీయమైనా, సినిమా అయినా సరే. అలా.. తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి కూడా అదే తెలుగు సినిమాపై తన వారసత్వాన్ని ఘనంగా చాటాడు. నేడు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు. ఇదే రోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం కూడా కావడం విశేషం. ఈ రెండు సందర్భాలను కలుపుతూ చరణ్ కు తండ్రిగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విసెష్ చెప్పాడు.  

 

 

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్స్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ల్లో చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘అందరిలానే నేనూ కొడుకు పుట్టగానే చాలా సంతోషించాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే చరణ్ పుట్టింది ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజున అని. అలాంటి రోజును సార్ధకం చేస్తూ సహజంగానే నటనలోకి వచ్చి హీరో అయ్యాడు. ఇది నేను ఎంతో గర్వించే విషయం. రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో రాసుకున్నాడు. ఈ మెసేజెస్ కు రామ్ చరణ్ తో తన చిన్ననాటి అనుభావాల ఫొటోలను జతపరిచాడు మెగాస్టార్.

 

చరణ్ ను హీరోగా 2009లో తెరంగేట్రం చేయించాడు చిరంజీవి. తన స్థాయిని ఏమాత్రం తగ్గించకుండా రామ్ చరణ్ ప్రస్థానానం కొనసాగడం చిరంజీవి గర్వంగా ఫీలవుతాడు కూడా. మగధీర, రంగస్థలం వంటి భారీ ఇండస్ట్రీ హిట్ లు సాధించి చిరంజీవి నట వారసత్వాన్ని ఘనంగా చాటాడు. చిరంజీవి కొడుకు అనే ముద్రను పోగొట్టి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి చరణ్ ఎదిగాడనేది వాస్తవం. చరణ్ కు చిరంజీవి చెప్పిన విసెష్ పై అప్పుడే సందడి మొదలైపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: