మ‌హ‌మ్మారి అయిన క‌రోనాపై యుద్ధానికి దేశం మొత్తం సిద్ధ‌మ‌వుతోంది. ఎలాంటి స‌మ‌స్య‌నైనా ఎదుర్కొనేందుకు అన్ని రంగాలు చేయి చేయి క‌లుపుతున్నాయి. ఇక సెల‌బ్రెటీల‌యితే ఈ విష‌యంలో చాలా ముందు ఉంటున్నాయి. లాభాల్ని మాత్ర‌మే లెక్క‌చేసే కార్పొరేట్ కంపనీలు సైతం వైద్య ప‌రిక‌రాల్ని ఊహించ‌ని స్థాయి రేటుకి విక్ర‌యించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సినీ దండు మేము సైతం అంటూ ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు రావ‌డమ‌నేది హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని చెప్పాలి.

 

ఇందుకు నితిన్ ముందుగా స్పందించి 20 ల‌క్ష‌లు ప్ర‌క‌టించ‌డంతో ఈ విరాళాల ప‌రంప‌ర మొద‌లైంది. ఆ వెంట‌నే జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 2 కోట్లు ప్ర‌క‌టించాడు. ఆ త‌రువాత రామ్‌చ‌ర‌ణ్ 70 ల‌క్ష‌లు, ఆ వెంట‌నే త్రివిక్ర‌మ్ 20 ల‌క్ష‌లు, కొర‌టాల 10 ల‌క్ష‌లు, అనిల్ రావిపూడి 10 ల‌క్ష‌లు, మ‌హేష్ బాబు కోటి ఉభ‌య రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కి అంద‌జేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ప్ర‌భాస్ కోటి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 75 ల‌క్ష‌లు, దిల్ రాజు 20 ల‌క్ష‌లు, సాయితేజ్ 10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. వి.వి. వినాయ‌క్ 5 ల‌క్ష‌లు. ఇక అల్ల‌రి న‌రేష్ త‌న చిత్రానికి వ‌ర్క్ చేస్తున్న 50 మందికి డైలీ వ‌ర్క‌ర్‌ల‌కు ఒక్కోక్క‌రికి 10 వేలు అంద‌జేశారు. ఇలా ఓ దండులా క‌రోనాపై ప‌రోక్షంగా యుద్ధానికి సిద్ధ‌మ‌య్యారు. దీంతో సినీ సెల‌బ్రిటీల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. 

 

ఇక ఎక్క‌డైనా స‌రే ఏద‌న్నా ఇబ్బంది వచ్చిందంటే చాలు మ‌న టాలీవుడ్ హీరోలు ముందుంటార‌ని చెప్పాలి. ఇప్పుడే కాదు మ‌న హీరోలు ఎక్క‌డైనా స‌రే రీల్ లైఫ్ మాత్ర‌మే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా హీరోల‌నిపించుకుంటారు. ఇలాంటి క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఒక‌రికి ఒక‌రు అండ‌గా నిలుస్తూ మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవాలి. మాన‌వ‌త్వంతో ఈ యుద్ధంలో గెల‌వాల‌ని ఒక‌రికి మించి మ‌రొక‌రు ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఎవ‌రి ఇళ్ళ‌ల్లో వారు భ‌ద్రంగా ఉండాలంటూ ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈ వ్యాధి వారి పట్ల‌ సోష‌ల్ మీడియా వేదిక‌గా  ఎవేర్‌నెస్ ని క‌ల‌గ‌చేస్తున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

: https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: