మెగాస్టార్ చిరంజీవి ఏ మూహూర్తాన సోషల్ మీడియాలోకి ఎంటరయ్యాడో కానీ.. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ల్లో సందడి నెలకొంది. బాక్సాఫీస్ ను రూల్ చేసినట్టే రెండు రోజుల నుంచీ సోషల్ మీడియాను రఫ్పాడేస్తున్నాడు. సోషల్ మీడియాలో తన ఎంట్రీకి వెల్ కమ్ చెప్పిన ప్రతి సెలబ్రిటీకి కూడా థ్యాంక్స్ చెప్పాడు మెగాస్టార్. అయితే.. ఇక్కడ ఫన్నీ ఏంటంటే పూరి జగన్నాధ్ కు థ్యాంక్స్ చెప్తూ చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.

IHG

 

‘వెల్ కమ్ అన్నయ్యా.. సామాజిక దూరం పాటిస్తున్న ఈ సమయంలో సామాజిక మాధ్యమాల్లో నీ ఎంట్రీ అందరినీ దగ్గర చేస్తుంది’ అని చిరంజీవికి పూరి ట్వీట్ చేశాడు. దీనికి చిరంజీవి రిప్లై ఇస్తూ ‘థ్యాంక్స్ పూరి. ప్రస్తుత పరిస్థితులు కుటుంబంతో కూడా గడిపేలా చేశాయి. ఈ టైమ్ లో నీకు ముంబై, బ్యాంకాక్ బీచ్ లు మిస్సవుతున్నావని అనుకుంటున్నాను. కానీ.. నువ్వు ప్రస్తుతం ఇంట్లో ఉండడం పవిత్రకు, ఆకాశ్ కు ఎంతో హ్యాపీ టైమ్ అనుకుంటున్నాను’ అని సరదాగా రిప్లై ఇచ్చాడు. దీనికి ‘అన్నయ్యా లవ్ యూ’ అంటూ పూరి రిప్లై కూడా ఇచ్చాడు. ట్విట్టర్ లో చిరంజీవి చేసిన సరదా కామెంట్స్ పై ఫన్నీ మేమ్స్ పడుతున్నాయి.

IHG

 

‘వాళ్లడిగారా.. బీచ్ లు గురించి వాళ్లడిగారా’ అంటూ నరసింహలోని కామెడీ ట్రాక్ ఫోటోలు పెడుతున్నారు. ఖుషీలో పవన్ కల్యాణ్ విజయ్ కుమార్ తో అనే ‘చాలు సర్’ అని, ‘వీడు చిన్నప్పుడు ఇంత చేసాడు’ అంటూ అందరివాడులో చిరంజీవి ప్రకాశ్ రాజ్ గురించి చెప్పే డైలాగ్స్ ను మేమ్స్, క్లిప్స్ కట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా చాలా ఫన్నీగా జరుగుతోంది. చిరంజీవి వస్తే ఇదే సందడి అంటూ మెగా ఫ్యాన్స్ కూడా సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: