కొడుకు పుట్టిన రోజు అయితే ఏ తండ్రికి మాత్రం ఆనందం ఉండదు చెప్పండి. మెగాస్టార్ అయినా సూపర్ స్టార్ అయినా తన పిల్లల గురించి చెప్పేటప్పుడు ఆ కళ్లలో ఆనందం కనిపిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ చిరంజీవి ట్వీట్ చేసిన విధానం కూడా అలానే అనిపిస్తుంది. రామ్ చరణ్ పుట్టినప్పుడు సహజంగానే ఉప్పొంగిపోయానంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు. మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి పోస్ట్ చేశాడు.

 

ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. తన అభిప్రాయాలను, భావాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. చిరు టైమింగ్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అందర్నీ పేరు పేరునా పలకరించడం, సెటైరికల్‌గా స్పందించడం, కామెడీని పంచడంతో ఇన్నాళ్లు చిరు టైమింగ్‌ను చాలా మిస్ అయ్యామని అభిమానులు చాలా ఫీలవుతున్నారు. ఇన్‌స్టాలో మొదటి పోస్ట్.. అమ్మ అంజనాదేవీ గురించి చేసి అందర్నీ టచ్ చేశాడు. ఇక రెండో పోస్ట్‌గా రామ్ చరణ్ గురించి చేశాడు.

 

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చిరు పోస్ట్ చేస్తూ.. నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. ‘రామ్ చరణ్ పుట్టినప్పుడు సహజంగానే ఉప్పొంగిపోయానని, అయితే ఆనాడు నాకు ఆ విషయం అర్థం కాలేదని, చరణ్ ఎందుకు ప్రపంచ రంగస్థల దినోత్సవం (వరల్డ్ థియేటర్ డే) రోజునే పుట్టాడని.. అయితే చేపకు ఈదడం ఎలా అబ్బిందో.. అలా రామ్ చరణ్ నటనను అలవర్చుకున్నాడు.. అన్ని పండుగల్లోకెల్లా రామ్ చరణ్ పుట్టిన రోజు అనేది ప్రత్యేకమైన పండుగ’.. అంటూ రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ట్వీట్ చేస్తూ చిరు భావోద్వేగానికి గురైనట్లు అర్థమవుతోంది. తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్... ఇద్దరి టాలెంట్ కలయికగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన రామ్ చరణ్, మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని, రెండో సినిమాకు రికార్డులు సృష్టించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

 

https://twitter.com/KChiruTweets/status/1243223462669250560?s=20

మరింత సమాచారం తెలుసుకోండి: