ఉగాది రోజు విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన మోషన్ పోష్టర్ కు జూనియర్ చరణ్ అభిమానుల నుండి చెప్పుకోతగ్గ స్థాయిలో విపరీతమైన స్పందన రాకపోవడం రాజమౌళిని కూడ ఆశ్చర్య పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఉగాది రోజున కరోనా వార్తలు తప్ప మరే సినిమాలకు సంబంధించిన వార్తలులేకపోవడంతో మొన్న విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ మోషన్ పోష్టర్ కు కనీవినీ ఎరుగని స్థాయిలో లైక్స్ వస్తాయని ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ ఆశించినట్లు టాక్.

 

అయితే ఈ మోషన్ పోష్టర్ కు హిట్స్ బాగా వచ్చాయి కానీ లైక్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడానికి గల కారణం జూనియర్ చరణ్ అభిమానుల నిర్లిప్తత అని అంటున్నారు. సుమారు ఒక నిమిషం నిడివి తో ఉన్న ఈ మోషన్ పోష్టర్ లో హై క్వాలిటీ కనిపించే విజ్యువల్ ఎఫెక్ట్స్ తో పాటు కీరవాణి హై ఎండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తప్ప ఆ మోషన్ పోష్టర్ లో ఇంకేముంది అన్న నిర్లిప్తత జూనియర్ చరణ్ అభిమానులకు ఏర్పడటంతో వారు విపరీతమైన శ్రద్ధ పెట్టి ఈ మోషన్ పోష్టర్ కు ఎక్కువ లైకులు వచ్చేలా ప్రయత్నించ లేదు అన్న  ఊహాగానాలు కూడ వస్తున్నాయి.

 

అంతేకాదు కొందరు జూనియర్ చరణ్ ల అభిమానులు అయితే ఈ మోషన్ పోష్టర్ లో రాజమౌళి ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ చూపెట్టే బదులు జూనియర్ కు సంబంధించిన కొమరం భీమ్  లుక్ రామ్ చరణ్ కు సంబంధించిన అల్లూరి సీతారామరాజు లుక్ ను రేఖా మాత్రంగా చూపించినా బాగుండేది కదా అంటూ అభిప్రాయ పడుతున్నట్లు టాక్. అయితే ఈ మూవీ విడుదలకు ఇంకా చాల సమయం ఉన్న పరిస్థితులలో రాజమౌళి అప్పుడే చరణ్ జూనియర్ ల లుక్ ను బయటపెట్టడం ఇష్టం లేక ఇలా వ్యవహరించి ఉంటాడు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

ఇది చాలదు అన్నట్లుగా ఈ మోషన్ పోస్టర్ లో చరణ్ ను నిప్పులా చూపిస్తే ఎన్టీఆర్ ను నీటితో పోల్చారు నిప్పు గొప్పని చరణ్ ఫ్యాన్స్ అంటుంటే నీటికే శక్తి ఎక్కువ అని తారక్ అభిమానులు వాదిస్తున్నారు. అంతేకాదు టైటిల్ లోగోలో చరణ్ ను ముందు పెట్టి తారక్ ను వెనుక పెట్టడం గురించి కూడా చర్చ నడుస్తోంది. రాజమౌళి చరణ్ కు  ఎక్కువ ప్రయారిటీ  తారక్ ను తగ్గించాడని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఈ మాటలకు ఏకంగా జక్కన్న షాక్ అవుతున్నట్లు టాక్. ప్రస్తుతం కరోనా సమస్యతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వందల కోట్లల్లో ప్రతిరేజు నష్టపోతున్న పరిస్థితులలో పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మార్కెట్ ను ఓపెన్ చేయడానికి ఉగాది రోజును ఇలా సెంటిమెంట్ గా జక్కన్న ఎంచుకుని ఉంటాడు అన్న కామెంట్స్ మరికొందరు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: