కరోనా సమస్య పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి బాసటగా టాలీవుడ్ హీరోలు కూడ రంగంలోకి దిగి తమవొంతు సహాయం చేస్తున్నారు. టాప్ హీరోలలో అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన భారీ విరాళాన్ని అనుసరిస్తూ చిరంజీవి చరణ్ మహేష్ లు తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం ఎవర్ని కలవకుండా క్వారంటైన్ లో ఉన్న ప్రభాస్ 4 కోట్లు భారీ విరాళం కరోనా సహాయ కార్యక్రమాలకు ఇవ్వడం ఇప్పుడు సంచన వార్తగా మారింది. అయితే తన విరాళంలో 3 కోట్లు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇచ్చి చెరొక 50 లక్షలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఇచ్చాడు. 


‘భాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా ఎదిగిన ప్రభాస్ తన విరాలంలో ఎక్కువ భాగం ప్రధానమంత్రి సహాయ నిధికి ఇవ్వడం ద్వారా నేషనల్ మీడియా దృష్టిని ప్రభాస్ ఆకర్షిస్తున్నాడు. అయితే ఈ విరాళంలో కనిపించని రాజకీయ కోణం ఉంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కు భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకులతో చాల మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న పరిస్థితులలో ప్రభాస్ ఈ విధంగా ప్రధానమంత్రి సహాయ నిధికి తన విరాళం అందచేసి ఉంటాడు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. 

 

ఈ కామెంట్స్ ఎలా ఉన్నా ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏ హీరో ఇవ్వనంత భారీ మొత్తాన్ని ప్రభాస్ విరాళంగా ఇచ్చి తాను ఉదారతలో కూడ బాహుబలి నే అని నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభాస్ ఇచ్చిన విరాళం వార్తలు ప్రభాస్ అభిమానుల మధ్య కూడ హాట్ న్యూస్ గా మారి ప్రభాస్ గొప్పతనాన్ని పొగుడ్తూ అతడి అభిమానులు కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రభాస్ కంటే భారీ పారితోషికాలు తీసుకునే చాలామంది బాలీవుడ్ సెలెబ్రెటీలు ఇంకా కరోనా సహాయ కార్యక్రమాల కోసం విరాళాలు ఇవ్వని పరిస్థితులలో ఇప్పుడు ప్రభాస్ విరాళంతో బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కూడ స్ఫూర్తి పొంది తమవంతు సహాయం చేసే ఆస్కారం ఉంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: