అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా మెగా ఇమేజ్ నుండి బయటపడాలని చూస్తున్నాడన్న విషయం తెలిసిందే. తన సినిమాల్లో గానీ, సినిమా ఫంక్షన్ లలో గానీ మెగా అన్న పేరుని ఎక్కువ వినపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అల వైకుంఠపురములో సినిమాతో ఈ విషయం క్లియర్ గా అర్థం అయింది. అల వైకుంఠపురములో టైమ్ లో అల్లు అర్జున్ ఆర్మీ గురించి ఎక్కువగా మాట్లాడిన విషయం తెలిసిందే.

 

 


మెగా ఇమేజ్ నుండి బయటపడాలన్న ఉద్దేశ్యంతోనో, మరొకటో తెలియదు గానీ మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై కూడా ఎక్కువ స్పందించలేదు. మెగాస్టార్ ఏదైనా సినిమా చేస్తున్నాడంటే మెగా హీరోలందరూ ఏదో ఒక రూపంలో ఆ సినిమాపై స్పందిస్తూ ఉంటారు. కానీ సైరా విషయంలో అల్లు అర్జున్ చాలా ఆలస్యం చేశాడు. అది కూడా అభిమానుల నుండి విమర్శలు వచ్చాక గానీ స్పందించలేదు.

 

 


ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే జరిగింది. చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఆల్రెడీ ట్విట్టర్ లో ఉన్న అందరు సెలెబ్రిటీలు స్వాగతం పలికారు. బన్నీ మాత్రం లేట్ చేశాడు. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా ఒక్కొక్కరుగా స్వాగతం పలుకుతుంటే బన్నీ అస్సలు స్పందించకపోవడం మెగా అభిమానులకి రుచించలేకపోయింది.

 

 


దాంతో బన్నీ మీద అనేక విమర్శలు చేశారు. విమర్శలు పర్వం కొనసాగుతుండగా బన్నీ నిన్న మద్యాహ్నాం మెగాస్టార్ కి వెల్కమ్ చెప్పాడు.  అయితే బన్నీ ఇలా ఎందుకు చేశాడో స్పష్టత లేదు గానీ, మెగా నుండి బయటపడాలనే ఉద్దేశ్యమే మెగాస్టార్ కి స్పందించకపోవడం అంటూ మెగా అభిమానులు విమర్శలు చేస్తున్నారు.  ఇలాంటి విమర్శలు వస్తాయని బన్నీకి ముందే తెలిసినా ఎందుకు ఆలస్యం చేశాడో బన్నీకే తెలియాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: