దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉంది.  ప్రజలు ఎక్కడిక్కడ అష్ట దిగ్భంధంలా ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంటి పట్టునే ఉంటున్నారు.  అయితే ఇంట్లో ఉంటే ఏదో ఉద్యోగులకు, ఉన్నవారికి చెల్లుబాటు అవుతుంది. కానీ రోజు కూలీకి వెళ్తూ.. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదల పరిస్థితి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.  అలాంటి వారి కోసం ప్రధాని మోది ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.  కానీ సామాజిక భాద్యత కలిగిన పౌరులు సైతం ముందుకు కదలాలి.. తమకు తోచిన సహాయం పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. 

 

 

ఈ నేపథ్యంలో సినీ తారలు ముందుకు వస్తున్నారు.  ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో మేము సైతం అనకుుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బాహుబలి ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు.  తాజాగా ప్రధానమంత్రి సహాయనిధికి మూడు కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. దీంతో అతడు ప్రకటించిన విరాళం మొత్తం నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రభాస్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. లాక్‌డౌన్ కారణంగా రోజువారీ కూలీలు సహా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకొచ్చింది.   

 

ఇప్పటికే రాజకీ, క్రీడా, సినీ రంగానికి చెందిన వారు విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.  టాలీవుడ్ ప్రముఖులైన మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌, దిల్‌రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటి వారు తమ వంతు సాయం ప్రకటించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రభాస్ రెండుసార్లు సాయం ప్రకటించి ఆయన పెద్ద మనసు చాటుకున్నాడు. నిజంగా రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ప్రభాస్ బాహుబలి అనిపించుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: