ఆర్.ఆర్.ఆర్ టటిల్  లోగో మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుండి సినిమా అభిమానుల్లో ఒకింత ఆశలు చెలరేగాయి. అప్పటి వరకు సినిమా అప్డేట్లేమీ లేకుండా అసలు సినిమా షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియక, థియేటర్లు మూతపడి ఏం చేయాలో అర్థం కాక.. తమ అభిమాన హీరో నుండి ఎలాంటి అప్డేట్లు లేక నిరాశ చెందుతున్న టైమ్ లో ఆర్.ఆర్.ఆర్ టైటిల్ రిలీజ్ చేసి. రాజమౌళి మళ్ళీ కొత్త ఆశలు చిగురించాడు. 

 


ఉగాది రోజున ఆర్.ఆర్.ఆర్ టైటిల్ రివీల్ చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. ఉగాది తర్వాత రెండు రోజులకి రామ్ చరణ్ పుట్టినరోజున రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. అలా అనుకున్న వారందరికీ షాక్ ఇస్తూ రాజమౌళి ఉగాది రోజునే ఎంచుకున్నాడు. మరి రామ్ చరణ్ పుట్టినరోజున ఏమీ ఉండదా అన్న సందేహం కూడా కలిగింది. అయితే ఈ పుట్టినరోజున కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్  రామ్ చరణ్ కి గిఫ్ట్ ఇస్తున్నాడట.

 

ఈ రోజు పది గంటలకి ఆ గిప్జ్ ఏంటనేది తెలిసిపోతుంది. సాధారణంగా మెగా పవర్ స్టార్ పుట్టినరోజంటే ఆ సందడే వేరు. అభిమానులంతా రామ్ చరణ్ పుట్టినరోజుని చాలా ఘనంగా చేస్తారు. కానీ కరోనా వల్ల ప్రపంచం మొత్తం అవస్థలు పడుతున్న టైమ్ లో ఎవరినీ ఎవరూ కలవడానికి వీలు లేని టైమ్ లో రామ్ చరణ్ తన పుట్టినరోజుని జరపుకోవద్దని అభిమానులకి కోరాడు.

 

ఇళ్ళలోనే ఉండండి అని సలహా ఇచ్చాడు. అంతే కాదు మీరు ఇళ్లలో ఉండడమే నాకిచ్చే గిఫ్ట్ అని చెప్పాడు. కాబట్టి రామ్ చరణ్ అభిమానులే కాదు.. అమ్దరూ ఇళ్లలోనే ఉంది ఎన్టీఆర్ ఇచ్చే డిజిటల్ గిఫ్ట్ ఏంటో చూసి, రామ్ చరణ్ కి మన గిఫ్ట్ ని కూడా అందిద్దాం.. మరో విషయం కరోనాని తరిమి కొట్టడానికి రామ్ చరణ్ తనవంతు సాయంగా డెభ్బై లక్షల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: