ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు మన దేశంలో వ్యాప్తి చెందుతుంది.  ఒక్కటి కాదు రెండు కాదు ఐదు లక్షలకు పైగా ఈ వైరస్ భారిన పడ్డారు.  23 వేల మందికి పైగా మరణాలు సంబవించాయి.  ప్రతిరోజూ ఈ సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కరోనాని అరికట్టేందుకు భారత దేశంలో లాక్ డౌన్ చేసిన విషయం  తెలిసిందే. అయితేకొంత మంది ఈ లాక్ డౌన్ గురించి సరైన పరిజ్ఞానం లేకపోవడంతో బయట తిరుగుతూనే ఉన్నారు.  కొన్ని చోట్ల గుంపులుగా కూడా ఉంటున్నారు.  కరోనా ఇప్పుడు గాల్లో ఉందని తుమ్మినా, దగ్గినా వైరస్ ఇట్టే ప్రబలిపోతుందని వైద్యులు చెబుతున్నారు.  తాజాగా కరోనా కట్టడి చేయడానికి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మాద్యమాల్లో పెడుతున్న విషయం తెలిసిందే.

 

తాజాగా  కరోనా వైరస్‌కు ప్రాంతం, భాష, వయసు వంటివేవీ తెలియదని, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని నటి త్రిష హెచ్చరించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని సూచించింది. కరోనా ప్రభావం ఒక రాష్ట్రం, ఒక ప్రాంతానికే పరిమితం కాదని,  అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. దేశ వ్యాప్తంగా మనం ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాం.. లేదంటే రోగాన భారిన పడితే మన కుటుంబం కూడా ఇబ్బందులు పడుతుందని అంటున్నారు. 

 

ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం కష్టమే అయినప్పటికీ తప్పదని పేర్కొంది. అందరూ ఐకమత్యంగా ఉండి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని, మనల్ని మనం కాపాడుకుంటూ ఈ సమాజాన్ని కాపాడుకుందామని త్రిష పిలుపునిచ్చింది. కష్టమొచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొవాలని.. ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొంటే భవిష్యత్ సంతోషంగా గడుపుతాం అని త్రిష అంటుంది.  మరోవైపు కరోనా వైరస్ అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని.. ఇంట్లోనుంచి బయటకు రావొద్దని అంటున్నారు. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: