కరోనా పుణ్యమా అని ఎవరు ఇంట్లో నుండి బయటకు రాకుండా బుల్లితెర పై వస్తున్న సీరియల్స్ అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు వరసపెట్టి చూస్తూ జనం విపరీతంగా టివిలకు అతుక్కుపోతున్నారు. ఇలాంటి సమయాన్ని కూడా అల్లు అరవింద్ మొదలు పెట్టిన ఆహా ఉపయోగించు కోలేకపోతోంది అన్నకామెంట్స్ వస్తున్నాయి. దీనికికారణం ఆహా లో తగినన్ని సినిమాలు లేకపోవడం వాస్తవానికి అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థలతో పోటీగా వచ్చేప్పుడు ఉండాల్సిన దూకుడు ముందుచూపు అల్లు అరవింద్ కు ఈసారి కొరవడింది అన్నకామెంట్స్ వస్తున్నాయి.

 

దీనికితోడు కనీసం ‘అల వైకుంఠపురములో’ హక్కులు కూడా సొంతం చేసుకోలేకపోవడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. సినిమాలు తీసే విషయంలో అరవింద్ ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తాడు అన్నకామెంట్స్ చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఆహా బిజినెస్ వ్యవహారంలో అరవింద్ అనుభవ రాహిత్యంతో ఇబ్బంది పడుతున్నాడు అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఉచితం అంటూ సబ్ స్క్రైబర్స్ ని ఆకర్షించే ప్రయత్నంచేసినా ఆహా కు ప్రయోజనం కనిపించడం లేదు అన్నగాసిప్పులు వస్తున్నాయి. దీనికి ప్రధానకారణం ఆహా లో కంటెంట్ తో పాటు సినిమాలు కూడ చాల తక్కువగా ఉండటం.

 

వాస్తవానికి ప్రపంచం అంతా అష్ఠదిగ్భందనం అయినవేళ జనం ఫ్రీ ఆఫర్ ను బాగా పట్టించుకోవాలి. ప్రస్తుతం ఆహా లో అర్జున్ సురవరం తప్ప ఏమీ సినిమాల్లేవు. దీనితో ఆహాలో అత్యధిక ఆదరణ పొందిన సినిమా ఇదే 6.8 మిలియన్ వ్యూస్ వచ్చాయని ఆహా టీమ్ చెపుతున్న పరిస్థితి. దీనితో భారీగా కంటెంట్ లేకుండా క్రేజీ సినిమాలు లేకుండా అరవింద్ ఆహా ఎందుకు మొదలు పెట్టాడు అంటూ ఎవరికీ అర్ధంకాని ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితులలో ఆహా లో కంటెంట్ పెంచడానికి అల్లు అరవింద్ కొత్త నటీనటులతో వెబ్ సీరీస్ లు నిర్మాణం చేసే ప్లాన్స్ వేస్తున్నా క్వాలిటీ లేని వెబ్ సీరీస్ లను జనం చూడరు అన్నవిషయం అరవింద్ కు తెలియదా అంటూ మరికొందరు ఆశ్చర్య పడుతున్నారు.

 

ఈవిషయాలు అన్నీ అరవింద్ దృష్టికి రావడంతో కాబోలు మొన్న ఉగాది నుండి ఆహా లో కొన్ని వెబ్ సిరీస్ లు ప్రారంభం కావడమే కాకుండా ఆ వెబ్ సిరీస్ లు చాల బాగున్నాయి అంటూ అనేక ప్రముఖ ఛానల్స్ ఈ కరోనా వార్తల హడావిడి మధ్య కూడ ఆహా ను ప్రమోట్ చేస్తూ వార్తలు ప్రసారం చేయడంతో ఇప్పటికే అరవింద్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించాడు అని అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: