ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలకలం చెలరేగుతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దాదాపు అన్ని దేశాలనే చుట్టేసింది. అంతేకాదు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేసింది. మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక ప్ర‌స్తుతం కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వినబడుతున్న మాట లాక్‌డౌన్. చైనాలోని వుహాన్ పట్టణంలో మొదలైన లాక్‌డౌన్‌ ప్రపంచ దేశాల మీదుగా ఇప్పుడు ఇండియానూ తాకింది. 

 

దీంతో ఈ వైరస్‌ను నివారించ‌డానికి అందరు సామాజిక దూరం పాటిస్తున్నారు. సామాజిక దూరంతోనే కరోనాను నియంత్రించవచ్చనే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే.. క‌రోనా వైర‌స్ ప్ర‌భాదం ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్‌పై ప‌డింది. బుల్లితెరపై ఎన్నో సంచలనాలు నమోదు చేసిన జబర్దస్త్ గురించి, అందులోని ఆర్టిస్ట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్లు లైఫ్ అందుకున్నారు. ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు.

 

అలాగే ఈ జబర్దస్త్ అనే వేదిక నుంచే ఎంతో మంది వెండితెరకు పరిచయమయ్యారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను ఇలా చాలా మంది కమెడియన్లు మంచి పేరు సంపాదించుకుని.. సినిమాల్లో సైతం న‌టించి మెప్పించారు. అయితే ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్టులందరిలో పెద్ద భ‌య‌మే ప‌ట్టుకుంది. క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమాలు, సీరియ‌ల్స్‌ షూటింగ్స్ మాత్ర‌మే కాకుండా జ‌బ‌ర్ద‌స్త్ షూటింగ్ కూడా ఆగిపోయింది. దీంతో ఆర్టిస్టులంతా ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం అని వాపోతున్నారు.

 

జబర్దస్త్ షూటింగ్ అంటే తమకు పండగ అని, జబర్దస్త్ నే నమ్ముకొని కొందరు ఆర్టిస్టులు తమ జీవితం గడుపుతున్నారు. దీంతో అటు షూటింగులు లేక, ఈవెంట్స్ లేక జబర్దస్త్ ఆర్టిస్టులంతా ఆర్థిక క‌ష్టాల‌తో విలవిలలాడుతున్నారని తెలుస్తోంది. కాస్త పెద్ద ఆర్టిస్టుల‌కు ఇలాంటి ఇబ్బందులు లేక‌పోయినా ఎపిసోడ్ చొప్పున పేమెంట్ అందుకునే చిన్న అర్టిస్టులు మాత్రం భవిష్యత్ ఏంటో అర్థంకాని అయోమ‌యంలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: