టాలీవుడ్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ సృష్టించిన సృష్టించిన రికార్డులేంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఆయ‌న సినిమాలు హిట్ కొవ‌డ‌మే కాదు ఆయ‌న రిజ‌క్ట్ చేసిన సినిమాలు కూడా  రికార్డు స్థాయిలో రిజ‌క్ట్ చేసిన సినిమాలు కూడా అనేక‌మే చెప్పాలి.  అలా రిజ‌క్ట్ చేసిన చిత్రాల్లో వేరే హీరోలు న‌టిస్తూ అరుదైన రికార్డులు సాధించిన హీరోలు ఎంతోమంది ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి న‌టిస్తున్న ఆర్.ఆర్‌.ఆర్‌. చిత్రంలో న‌టిస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఇటీవ‌లె విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ రిజ‌క్ట్ చేసిన చిత్రాలేంటో ఓసారి చూద్దాం...నాగార్జున, కార్తి కాంబినేషన్‌లో  వచ్చిన ‘ఊపిరి’ క‌థ ముందు కార్తి స్థానంలో ఎన్టీఆర్‌నే అనుకున్నార‌ట‌. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ సీన్‌లో నాగార్జున కాళ్లు పట్టుకునే సన్నివేశాలు ఉండటం వ‌ల‌న ఆయ‌న‌ నంద‌మూరి అభిమానులు ఒప్పుకుంటారు. అది పాత్ర మాత్ర‌మే అయినా కొంత మందిఫ్యాన్స్ దాన్ని కూడా స‌హించ‌లేనివారు ఉంటారు. హీరో ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు. దాంతో ఎక్క‌డ ఫ్యాన్స్ మ‌న‌సు ఎక్క‌డ నొచ్చుకుంటుందో అన్న భ‌యంతో ఆయ‌న రిజెక్ట్ చేశార‌ట‌. అంతేకాదు ఎన్టీఆర్ ప్లేస్‌లో కార్తి ఆ క్యారెక్టర్ చేసి.. ఆ పాత్రలో తాను త‌ప్ప వేరెవ్వ‌రూ న‌టించ‌లేర‌న్నంత‌గా పాత్ర‌లో ఇమిడిపోయార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

 

ఒక్క ‘ఊపిరి’ సినిమా విషయంలోనే కాదు ఇలా ర‌క ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఆయ‌న రిజ‌క్ట్ చేసిన చిత్రాలు చాలానే ఉన్నాయ‌ని చెప్పాలి. ఎన్టీఆర్...అన్న కళ్యాణ్ రామ్ హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్న ‘అతనొక్కడే’ స్టోరీని  కూడా  ఆ ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి...జూనియర్‌ను దృష్టిలో పెట్టుకునే క‌థ మొత్తం  రెడీ చేసుకున్నాడట. అయితే సురేంద‌ర్‌రెడ్డి అప్ప‌టికే మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబ‌ట్టి అన్న‌క‌ళ్యాణ్‌రామ్‌కి హిట్ ఇస్తే బావుంటుంద‌న్న ఆలోచ‌న‌తో క‌ళ్యాణ్‌రామ్ చేశాడ‌ట‌. అలాగే ఆర్య సినిమాను కూడా ఎన్టీఆర్ వ‌ద్ద‌నుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సుకుమార్...‘ఆర్య’ వంటి డిఫరెంట్ స్టోరీని ముందుగా తారక్ కే వినిపించిన్న‌ప్ప‌టికీ...  జూనియర్ ఎన్టీఆర్...ఆయన ఇమేజ్ కి తగ్గ కథ కాదని ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేయనని చెప్పడంతో ఈ సినిమా అల్లు అర్జున్‌దగ్గరకి వెళ్లింది. 

 

‘ఆర్య’  బన్ని కెరీర్ కే పెద్ద హిట్ గా నిలిచింది. ఇలా ఎన్నో చిత్రాల‌ను ఆయ‌న త‌న ఇమేజ్‌కి కూడా మ్యాచ్ అవుతుందా లేదా అని ఆలోచించి మ‌రీ ఆయ‌న నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ట‌. రవితేజ న‌టించిన‌ ‘కిక్’, ‘భద్ర’, ‘కృష్ణ’ చిత్రాల ప‌రిస్థితి కూడా దాదాపుగా అదే కార‌ణ‌మ‌ని చెప్పాలి. ఈ చిత్రాలు రవితేజ కెరీర్‌కు మంచి హెల్ప్ అయ్యాయ‌ని చెప్పాలి. ఒక ర‌కంగా మ‌నం ఆలోచిస్తే  అలాంటి పాత్ర‌ల్లో ఎన్టీఆర్ బావుండ‌డ‌నే చెప్పాలి. ఎన్టీఆర్ దాదాపు సీరియ‌స్ మ‌రియు మాస్ పాత్ర‌ల‌కి బాగా సెట్ అవుతార‌ని ఆయ‌న ఫ్యాన్స్ తో స‌హా చాలా మంది భావిస్తారు. మొద‌టి సినిమాతోనే మాస్ ఇమేజ్‌ని క్రియేట్ చేసిన వినాయ‌క్ దిల్ చిత్రం కూడా ఎన్టీఆర్‌తో చెయ్యాల‌నుకున్నా కుద‌ర‌క పోవ‌డంతో నితిన్‌ని హీరోగా పెట్టి చేశార‌ట‌. అలాగే మహేశ్ బాబును ‘శ్రీమంతుడు’కూడా కొరటాల శివ...ముందు క‌థ చెప్ప‌గా ఎన్టీఆర్ దృష్టికి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎందుకో పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌లేద‌ట‌. ఇక ప్ర‌స్తుతం రాజమౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: