టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.  మొదటి సినిమా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాడు.  ఈ మూవీలో రామ్ చరణ్ ఎంతో రఫ్ గా మాస్ హీరోగా కనిపించాడు. డ్యాన్స్, ఫైట్స్, సెంటిమెంట్ సీన్లు అన్నీంటా మెప్పించాడు.  అప్పుడే ఇండస్ట్రీకి మరో మెగా పవర్ స్టార్ వచ్చాడని చాలా మంది కితాబు ఇచ్చారు.

 

ఇక తండ్రి ఇమేజ్... సినీ బ్యాగ్ గ్రౌండ్ ఉందన్న గర్వం ఏమాత్రం చూపించకుండా ఒక్కో సినిమాకి తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చాడు రామ్ చరణ్.  రెండో సినిమా ‘మగధీర’ తో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోత మోగించాడు.  ఈ మూవీలో రామ్ చరణ్ తన విశ్వరూపం చూపించాడు.  కాలభైరవుడిగా తన పాత్రతో విమర్శకులు నుంచి ప్రశంసలు పొందారు. మెగాపవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు అయినా.. నటించిన సినిమాలు మాత్రం వేళ్లపై లెక్కించుకోవొచ్చు. బాలీవుడ్ లో అపూర్వ లాఖియా దర్శకత్వంలో జంజీర్ తెలుగు లో తుఫాన్ మూవీలో నటించాడు.  

 

మూవీ పెద్దగా సక్సెస్ కాకున్న తండ్రిలా తాను బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే నటించాడు.  2015 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ లో నటించాడు అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.  2016 లో వచ్చిన ధృవ మూవీ తో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు.  సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం మూవీలో చెవిటి వాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించారు. ప్రతి సినిమాకు తనదైన స్టైల్.. ప్రదర్శిస్తూ వస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: