మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  గూర్చి ఎవరికి  తెలియదు. చిరంజీవి వారసుడిగా, బాబాయ్ పేరు నిలబెట్టే హీరోగా చరణ్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.  అసలు రామ్ చరణ్  మొదట సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. ఒక పక్క మెగాస్టార్ కొడుకు, మరోపక్క పవర్ స్టార్ వారసత్వం చరణ్ పేరు నిలబెట్టుకుంటాడా...?తండ్రి, బాబాయ్ పేరు నిలబెడతాడా...? అని అందరు చూపు చరణ్ మొదటి సినిమాపైనే. ఆ రోజు రానే వచ్చింది. 

 

 


సెప్టెంబర్ 28, 2007 మెగాస్టార్ చిరంజీవి నటవారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయం అయినాడు. చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు టాలీవుడ్ మొత్తం మెగావారసుడి రామ్ చరణ్ - పూరీ కాంబో మూవీ ‘చిరుత’ కోసం ఎదురుచూసిన సందర్భం. అనుకున్నట్టుగానే ‘చిరుత’  సినిమా విడుదలై ఇండస్ట్రీ ప్రముఖుల మన్ననలు అందుకుంది.  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విడుదలైన చిరుత సినిమా విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు దక్కాయి. మొదటి సినిమాలో బాగానే నటించాడు. 

 

 

ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.అప్పుడు నోళ్లు వెళ్ళబెట్టారు అందరూ. చరణ్ విమర్శించే వాళ్లే శభాష్ అనిపించేలా నటించి, తనలోని అసలైన మెగా పవర్ ని బయట పెట్టాడు. అలా మొదలైన రామ్ చరణ్ సినీ ప్రస్థానం ఇంకా ఎక్కడ వెనుతిరిగి చూడకుండా చేసింది. ఒక్కోసారి సినిమాలు ప్లాప్ అయినా గాని కుంగిపోలేదు. పట్టుదలతో సినిమాలు తీసాడు. ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు మన మెగా పవర్ స్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి: