కరోనా భయంతో సినిమాలు షూటింగ్ లు ఆగిపోవటంతో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ లేకుండా పోయింది. దీంతో తమ అభిమానులను అలరించేందుకు సినీ తారలు సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. లాక్‌ డౌన్‌ మొదలైన దగ్గర నుంచి తమ సోషల్ మీడియా పేజ్‌ లో వర్క్‌ అవుట్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు సినీ తారలు. అయతే అవి కూడా బోర్ అనిపించటంతో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా షేర్‌ చేసుకుంటున్నారు.

 

అయితే తాజాగా దీపిక ఓ ఆసక్తికర పోస్ట్ ను చేసింది. కత్రినా కైఫ్‌ అంట్లు తోముతున్న వీడియోను పోస్ట్ చేసిన దీపికా.. క్యాట్ నా ఐడియాను కాపీ కొట్టింది అంటూ కామెంట్ చేసింది. కొద్ది రోజుల క్రితం కత్రినా ఈ వీడియోను స్వయంగా తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు అదే వీడియోను షేర్‌ చేస్తూ దీపిక కామెంట్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

గతంలోనూ క్యాట్ దీపికాల సోషల్ మీడియా సంభాషణ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల కత్రినా తన బ్యూటీ లైన్‌ ప్రారంభించిన సందర్భంగా దీపిక ఆమెను ప్రశంసించింది. అయితే గతంలో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందన్న ప్రచారం కూడా ఉంది. కాఫీ విత్‌ కరణ్ షోలో దీపిక మాట్లాడుతూ తానకు కత్రిన పాస్ పోర్ట్ చూడాలనుందంటూ తాను పెద్ద దుమారమే లేపింది. అయితే దీపికా, రణవీర్‌ ల వివాహానికి కత్రిన హాజరు కావటంతో ఆ రూమర్స్ కు తెరపడింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I regret to inform you that Season 1:Episode 5 stands cancelled because @katrinakaif stole my idea!Hmmff!!!😤🤷🏽‍♀️🤣🤣🤣 #PlagiarismInTheTimeOfCovid19

A post shared by deepika Padukone (@deepikapadukone) on

మరింత సమాచారం తెలుసుకోండి: