ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా భారిన పడింది.  ఎక్కడ చూసినా కరోనా మరణాలు సంబవిస్తున్నాయి. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ వైరస్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు.  చిన్న దేశాలే కాదు అగ్ర దేశాలు సైతం ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది.  బ్రిటీష్ యువరాజు చార్లెస్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో లండన్ లో ప్రిన్స్ చార్లెస్ తో కనిక కపూర్ మాట్లాడుతున్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే కరోనా సామాన్యులనే కాదు యువరాజులను కూడా వదలదని కన్ఫామ్ అయ్యింది. 

 

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 24,295కి చేరింది. కరోనా పాజిటివ్ కేసులు 531,819 నమోదు అయ్యాయి. ఇటలీలో అత్యధికంగా 74,386 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్పెయిన్‌లో ఒక్కరోజే 738 మంది మృతి చెందారు. కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నప్పటికీ క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది ఇంటికే పరిమితమయ్యారు. అయితే భారత దేశంలో కరోనా వైరస్ నిర్మూలించేందుకు  లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇప్పటి వరకు కరోనా గురించి రక రకాల కామెంట్స్ చేసిన రాంగోపాల్ వర్మ తాజాగా మరోసారి వెరైటీగా స్పందించారు.

 

భూ గ్రహానికి పట్టిన వైరస్‌ మనుషులని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ అన్నారు.  భూమిపై ఉన్న జీవుల్లో మనుషులు మాత్రమే తమ సొంత ప్రాంతంలో ఉండకుండా ఎల్లప్పుడూ సంచారం చేస్తుంటారన్నారు. ఉన్నదాన్ని రెట్టింపు చేసుకోవాలని ఎల్లప్పుడు ప్రయాణిస్తూ భూమికి సంబంధించిన సహజ వనరులను నాశనం చేస్తుంటాడు. ఇన్ని లక్షణాలు మరే వైరస్ లో ఉంటాయి చెప్పండి..  భూ గ్రహానికి పట్టిన జబ్బు మానవులు అయితే మానవులకు పట్టిన రోగం వైరస్‌ అని అన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: