ప్రస్తుతం కరోనా వైరస్ మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది.  ఎక్కడ చూసినా ఈ కరోనా గురించిన చర్చలే జరుగుతున్నాయి. చిన్నా లేదు పెద్ద లేదు సామాన్యుల నుంచి కరోడ్ పతుల వరకు ఈ కరోరా మహమ్మారి పట్టి పీడిస్తుంది.  దేశ వ్యాప్తంగా కరోనా ని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఉన్నవారి సంగతి పక్కన బెడితే రెక్కాడితే కాని డొక్కాడని అతి పేదల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.  ముఖ్యంగా దినసరి కూలీల పరిస్థితి, యాచకుల పరిస్థితి అద్వాన్నంగా తయారైంది.  తాజాగా కొందరు బిచ్చగాళ్లు సమస్యలు తీసుకొస్తున్నారంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యపై జబర్దస్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ మండిపడింది. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నా.. మూడు పుటలా కలిగింది తింటున్నాం. కానీ అన్ని దుకాణాలు బంద్ ఉన్నాయి.

 

పేదలకు ఫుడ్‌ దొరకట్లేదు. కొందరికి చెత్త ఏరుకోవడం తప్ప మరో ఆప్షన్‌ లేదు. దాని వల్లే వారు బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో వారి ఆకలి గురించి పట్టించుకుంటున్నారా?  మనం తినే చపాతిలో ఒక్కటి ఇచ్చినా ఇద్దరు తినే పరిస్థితిలో వారు ఉన్నారు.  కొంచం అన్నం పెడితే వారి ఆకలి తీరుతుంది.  బయట హూటళ్లు కూడా బంద్ ఉన్నాయి. పేదవారు మాత్రం తినట్లేదు.. ప్లీజ్‌ ప్లీజ్‌ ప్లీజ్‌ వారికి కాస్త ఆహారం అందిద్దాం' అని పిలుపునిచ్చింది.'చపాతి, రైస్‌.. కనీసం బిస్కెట్లయినా సరే వారికి ఇస్తే వారు తింటారు.

 

కనీసం మీ గేటు వద్దయినా కాస్త ఆహారం పెట్టండి. వారు వచ్చి తీసుకుని తింటారు' అని తెలిపింది.   అయితే రష్మి అంటున్న మాటలపై మరికొందరు నెటిజన్లు పలు రకాలుగా దీనిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన రష్మీ ఇప్పుడు మన స్వార్థం గురించి ఆలోచించకండి పేదవారిని ఆదుకునే విధంగా ఎలాగైనా వారికి ఆహారం చేరే విధంగా ఆలోచించండి అని వేడుకుంటుంది. ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే.. మరెప్పుడు నేర్చుకుంటారో' అని రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: