ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి తీవ్రత నుండి తప్పించుకునే ప్రయత్నంగా, భారతదేశం ఏప్రిల్ 14 వ తారీకు వరకు లాక్ డౌన్ ప్రకటించింది. కానీ ఈ లాక్ డౌన్ కారణంగా ఎన్నో పేద కుటుంబాలు ఆకలితో ఇబ్బంది పడుతున్నాయి. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పేద ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నాయి. ఆ విధంగానే పలువురు సినీ ప్రముఖులు కూడా వారికి సహాయం చేయడం కోసం ముందుకు వస్తున్నారు.

 

 

ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు కోట్లు, ప్రభాస్ మూడు కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ రూ.75 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. మెగా స్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా రూ.75 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు కూడా వారికి వీలైనంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.   

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

తాజాగా అల్లు అర్జున్ కూడా వీళ్ళ దారిలోకి వచ్చాడు.  తన వంతుగా బన్నీ, రూ. కోటి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే కాకుండా కేరళకు కూడా ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. మామూలుగానే కేరళలో అల్లు అర్జున్‌కు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కేరళకు కూడా ఆర్ధిక సాయం ప్రకటించడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రజలను బయట తిరగొద్దనీ, ఒకటి రెండు సార్లు చేతులను శుభ్రంగా కడుక్కోవాలనీ, సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించమని బన్నీ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: