మొదట రామ్ చరణ్ గానే పరిచయం అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా వెండితెరకి చిరుత సినిమాతో పరిచయం అయ్యాడు. మొదట హీరోగా నటించిన 'చిరుత’ విడుదలై ఇండస్ట్రీ ప్రముఖుల మన్ననలతో పాటు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాడు. అప్పుడే మెగా పవర్ స్టార్ బిరుదు పొందాడు రామ్ చరణ్. అయితే  హీరోగా రామ్ చరణ్‌కి ప్రశంసలు దక్కాయి. కానీ చిరుత  సినిమాకి ప్రశంసలతో పాటు పెదవి విరుపులు చాలానే వచ్చాయి.

 

సినిమాలో కంటెంట్ లేదని, రామ్ చరణ్ లుక్ కూడా సరిగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదని కొంతమంది విమర్శించారు. ఆ సందర్భంలో చాలా మంది  రామ్ చరణ్ చిరంజీవి కొడుకు కాకపోతే హీరో అయ్యేవాడా...? కేవలం మెగాస్టార్  కొడుకు అలాగే పవర్ స్టార్ క్రెజ్ వల్ల  హీరో అయ్యాడు అని చాలా మంది అనుకున్నారు. 

 

 

రామ్ చరణ్ ఫైట్స్, డాన్స్‌లతో ఇరగదీసినా.. ఆయన మేకోవర్ సరిగా లేకపోవడం, డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్‌గా సూట్ కాకపోవడంతో ప్రసంసలతో పాటు విమర్శలు వచ్చాయి.అసలు హీరో అయ్యే లక్షణాలే లేవని చాలామంది పెదవి విరిచారు రామ్ చరణ్ ని చూసి.. కానీ  చరణ్ మాత్రం క్రుంగి పోలేదు. నటుడిగా తను ఏంటో నిరూపించుకోడానికి ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసాడు. సరిగ్గా అదే టైములో రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ సినిమా విడుదలైంది. ‘చిరుత’లా పంజా విసిరిన రామ్ చరణ్, మగధీర సినిమాతో " ధీరుడు" అనిపించుకున్నాడు.   

 

 

టాలీవుడ్‌లోనే  మరిచిపోని మధురకావ్యం లాంటి చిత్రాన్ని అందించారు వీరు ఇద్దరు. తొలి సినిమా హిట్.. రెండో సినిమా బ్లాక్ బస్టర్ ఏ హీరోకి అయినా ఇంతకంటే ఏం కావాలి..? అప్పుడు అనిపించుకున్నాడు నిజమైన మెగా పవర్ స్టార్ అని. మెగా అభిమానుల  ఆనందానికి అవధులు లేవు. ఈ తరంలో రామ్ చరణ్‌కి తిరుగేలేదనుకున్నారు.పెదవి విరిచిన వాళ్లే చరణ్ ని చూసి నోరు వెళ్ళబెట్టారు. నువ్వే అసలైన "మెగా వారసుడివి" అని, బాబాయ్ పరువు నిలబెట్టావు అని ప్రశంసించారు. తర్వాత చాలా సినిమాలు చేసాడు. విజయాలు, అపజయాలు ఎన్నో చూసాడు. చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా కి నిర్మాతగా మారి ఆ సినిమాని తెరకెక్కించాడు. తండ్రి ని మళ్ళీ సినిమాలో నటింపచేసి ప్రేక్షకుల ఆశని నిరవేర్చాడు. 

 

 

"తండ్రికి తగ్గ కొడుకు "అని అనిపించుకున్నాడు . తర్వాత రంగస్థలం సినిమాలో చెవిటి వాడి క్యారెక్టర్ లో జీవించేసాడు. సినిమా రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి ఆనందానికి అవధులు లేవు. కొడుకుని చూసుకుని మురిసిపోయాడు.. ఒక్క చిరంజీవి మాత్రమే కాదు చరణ్ అమ్మ, బాబాయ్ అందరు చరణ్ ని ప్రశంసించారు. తర్వాత "సైరా" సినిమాతో మళ్ళీ నిర్మాతగా మారి చిరంజీవిని తెరపై మళ్ళీ చూపించాడు.తండ్రి పరువుని నిలబెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకుల కాకుండా తనకంటూ ఒక ప్రేత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: