ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బతో ఎంతోమంది అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్నారు. చివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదలు సైతం బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వచ్చే రెండు నెలలు ఎలా గడుస్తుందో అని పొట్టచేత పట్టుకొని ఆకాశం వైపు చూస్తున్నారు. వీరి ఆకలి బాధ తీర్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంతవరకు ఉదార‌త‌ చూపిస్తున్నాయి. రేషన్ తో పాటు కొంత నగదు కూడా వారి అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించాయి. ఈ క్ర‌మంలోనే సినిమా వాళ్లు సైతం ముందుకు వ‌చ్చి త‌మ వంతుగా ఉదార‌త చూపిస్తూ సాయం చేస్తున్నారు.



ఈ క్ర‌మంలోనే చాలా మంది సినిమా హీరోలు త‌మ వంతుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల కోసం ల‌క్ష‌ల్లో సాయం చేశారు. ఇక మెగా ఫ్యామిలీ హీరోల విష‌యానికి వ‌స్తే పవన్ కల్యాణ్ ఏకంగా రెండు కోట్ల రూపాయలు, కొడుకు రామచరణ్ 70 లక్షల రూపాయలు ఇచ్చారు కానీ... చిరు మాత్రం కేవలం సినిమా కార్మికులకు మాత్రమే ఇచ్చారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద సినిమా కార్మికుల కోసం చిరంజీవి ఏకంగా కోటి రూపాయ‌లు ఇచ్చారు. ఇందులో త‌ప్పు లేదు. అయితే చిరుకు కేవ‌లం సినిమా వాళ్లు మాత్ర‌మే క‌నిపిస్తున్నార‌ని... రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు క‌నిపించ‌డం లేదా ? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి.



దీనిని బ‌ట్టి చూస్తే చిరు మ‌ళ్లీ ప్రజా క్షేత్రంలోకి వ‌చ్చే సూచ‌న‌లు క‌న‌ప‌డ‌డం లేద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. గ‌తంలో సీఎం కావాల‌న్న ఆశ‌తో రెండు తెలుగు రాష్ట్రాలు క‌లిసి ఉన్న‌ప్పుడు చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఆ పార్టీని న‌డ‌ప‌కలేక కాంగ్రెస్‌లో క‌లిపి వేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు బ‌హుమానంగా కేంద్ర మంత్రి ప‌ద‌వి ల‌భించింది. ఇక ఇప్పుడు చిరు సోద‌రుడు ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉన్నారు. చిరు మాత్రం మ‌ళ్లీ ప్ర‌జాక్షేత్రంలోకి వ‌చ్చే ఉద్దేశంలో లేర‌న్న‌ట్టుగా ఉంది. దీంతో ఇప్పుడు చిరు సినిమా వాళ్ల‌ను మాత్ర‌మే ప‌ట్టించుకున్నార‌న్న సెటైర్లు ప‌డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: