ఓటీటీ.. ప్రజెంట్ జనరేషన్ కి బాగా పరిచయం ఉన్న పేరు. డిజిటల్ మీడియాలో ప్రస్తుతం ఈ యాప్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎలాగూ షూటింగ్స్ లేవు, సినిమా రిలీజ్ లు లేవు. అందుకే ఇదే ఛాన్స్ తో .. ఓటీటీ యాప్స్ దూసుకుపోతున్నాయి. ప్రజెంట్ ..ఈ ఫ్లాట్ ఫామ్స్ లో తప్ప క్రరేజీ ఎంటర్ టైన్ మెంట్ దొరకే ఛాన్స్ ఎక్కడా లేదు . అందుకే ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఈయాప్స్ కి క్రేజీ విపరీతంగా పెరిగిపోయింది.

 

ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన అమెజాన్, నెట్ ఫ్లిక్స్  తమ సబ్ స్రైబర్స్ ని రోజురోజుకీ పెంచుకుంటోంది. నెట్ ఫ్లిక్స్ లో ప్రజెంట్  యూసేజ్ లో ఉన్న వెబ్ సిరీస్, మూవీస్ తో పాటు మరో కొత్త వెబ్ సిరీస్ ..మనీషా కొయిరాలా నటిస్తున్న ..మస్కా కూడా యాడ్ అయ్యింది. ఇక అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటికే హిట్ అయిన సిరీస్ లకు సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే సూపర్ హిట్ అయిన ఫోర్ మోర్ షాట్స్ కి సెకండ్ సీజన్ చేస్తున్నారు.  అన్ని లైవ్ షోస్ క్యాన్సిల్ చేసి ఫోన్ ఇన్ లైవ్స్ ప్లాన్ చేయ్యడంతో ఇంకాస్త్ క్రేజీ కంటెంట్ కి ఎట్రాక్ట్ అవుతున్నారు జనాలు .

 

వీటితో పాటు జీ..5 ఓటీటీ కూడా ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఎక్కువ వ్యూయర్స్ ని సంపాదించింది.  వీటితో పాటు అచ్చతెలుగు ఓటీటీ యాప్ ఆహా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆడియన్స్ కి నచ్చేలా ఎంటర్ టైన్ మెంట్ , బోల్డ్, థ్రిల్లింగ్, కామెడీ కంటెంట్ తో రకరకాల వెబ్ సిరీస్ లు లైమ్ లైటోకి తెచ్చింది. 

 

మరో ఓటీటీ యాప్ హంగామా రీసెంట్ టైమ్స్ లో 20 పర్సెంట్ ఎక్కువ మంది వ్యూయర్ షిప్ ను గెయిన్ చేసుకుంది. కామెడీతో పాటు హార్రర్ సిరీస్ లను స్టార్ట్ చేసింది ఈ యాప్. మరో యాప్ వూట్ కూడా లాస్ట్ మన్త్ నుంచి  సబ్ స్క్రైబర్స్ పెరిగినట్టు చెబుతోంది. ప్రస్తుతం సినిమాలు లేని ఈ  సిచ్యువేషన్ లో దీన్ని సస్టెయిన్ చేసుకోవాలంటే సరికొత్త కంటెంట్ ఇస్తేనే ఈ వ్యూయర్ షిప్ కంటిన్యూ అవుతుంది. లేకపోతే.. మళ్లీ లాక్ డౌన్ పీరియడ్ అయినతర్వాత మళ్లీ అంతకుముందు పరిస్తితే ఎదురవుతుందని అంటున్నారు జనాలు.

 

తెలుగు మార్కెట్ లోకి కొత్తగా అడుగుపెట్టిన ఆహా కూడా సొంత మార్కెట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్ కోసం ప్రయత్నాలు  చేస్తున్న ఈ ప్లాట్‌ ఫాం త్వరలో మరింతగా అభివృద్ది చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: