సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదుచు చూస్తున్న rrr మోషన్ పోస్టర్ ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఉగాది కానుకగా విడుదల చేశారు. దాంతోపాటు రౌద్రం, రణం, రుధిరం అనే టైటిల్‌ను ప్రకటించేశారు. విదులైన కొన్ని గంటల్లోనే ఈ వీడియోకు వితరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఫాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ గురువారం రాత్రి తన సోషల్ మీడియా ఖాతాలో ‘సోదర రామ్ చరణ్, నీ పుట్టినరోజును బాగా జరపాలని అనుకున్నాను. కానీ మనం ప్రస్తుతం లాక్‌డౌన్‌లో కాబట్టి, ఇంట్లో ఉండటమే ముఖ్యం. అందుకే రేపు ఉదయం 10 గంటలకు నీకొక డిజిటల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఇది నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప అనుభూతి అవుతుంది. రామరాజు కోసం భీమ్’ అని పోస్ట్ చేసారు.

 

 

ఆ సర్ప్రైజ్ లో ఏముంటుందో అని రామ్ చరణ్ తో సహా అభిమానులందరూ ఆసక్తి పెరిగింది.ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 4 గంటలకి తారక్ ఒక వీడియోను విడుదల చేసారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ వీడియోలో రామ్ చరణ్ ను నిజంగానే సర్ ప్రైజ్ చేసింది. ఎన్టీఆర్ డైలాగ్‌లో ప్రారంభమైన ఈ వీడియోలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా ఇరగదీసాడు. దీని కోసం ఎన్ని రోజులు ఎదురు చూసినా తప్పులేదు అనేంత, అద్భుతంగా ఉంది ఈ వీడియో. అల్లూరి సీతారామరాజునుని చూడని వాళ్లకు అల్లూరి అంటే ఇలాగే ఉండేవారా అనేంత అద్భుతంగా చూపించారు. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ రోమాలు నిక్కబొడుకునేట్టు ఉన్నాయి. కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సింథిల్ కుమార్ కెమెరా పనితనం వారెవ్వా అనిపించేట్టుగా ఉన్నాయి. ఈ దెబ్బతో rrr సినిమా రేంజ్ ఇంకో మెట్టు ఎక్కిందనే చెప్పవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: