మ‌ణిర‌త్నం మూవీ చెలియ‌తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన భామ అదితిరావ్ హైద‌రీ. ఆ త‌ర్వాత స‌మ్మోహ‌నం, న‌వాబు చిత్రాల్లో న‌టించి మెప్పించింది. ‘‘విమర్శించేవాళ్లకు ఏదో విషయంలో కోపం అయినా ఉండి ఉండాలి. లేకపోతే వాళ్ల జీవితం పట్ల వాళ్లకు ఏదైనా బాధ అయినా ఉండి ఉండాలి”….అని అంటోంది ‘సమ్మోహనం’ నాయిక అదితీ రావ్‌ హైదరీ. “విమర్శలకు దూరంగా పారిపోలేం. ఎలాంటి విమర్శని అయినా పాజిటివ్‌గా తీసుకోవాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తులను విమర్శించేవాళ్లు ఏదో సమస్యతో బాధ పడుతున్నారని నా అభిప్రాయం’’ అని అంటోంది అదితీ రావ్‌ హైదరీ సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శల గురించి అదితీ మాట్లాడుతూ.


 
‘‘విమర్శించేవాళ్లకు ఏదో విషయంలో కోపం అయినా ఉండి ఉండాలి. లేకపోతే వాళ్ల జీవితం పట్ల వాళ్లకు ఏదైనా బాధ అయినా ఉండి ఉండాలి. ఆ కోపాన్ని సోషల్‌ మీడియాలో చేసే విమర్శల ద్వారా తీర్చుకుంటున్నారనుకుంటున్నాను.వాళ్ల విషయంలో మనం ఒక్కటే చేయగలం! అని నా ఫీలింగ్‌. అదేంటంటే.. ‘జాలి చూపించడం’. అలాగే ‘వాళ్లు బాగుండాలని కోరుకోవాలి’. ఒక్కోసారి నేను వాళ్లకు ‘మీకు ఈరోజు బాగుండాలని కోరుకుంటున్నాను’ అని రాసి పంపిస్తుంటాను. వాళ్ల మంచి కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ల కోపం వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది’’ అన్నారు.

 

“నేను త్వరగా హర్ట్‌ అవుతాను. నేను ఫీల్‌ అయిన విషయం నా ముఖం మీద కనిపించేస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ బలాలు, బలహీనతలు ఉంటాయి. నాలో ఉన్న ఓ బలహీనత ‘సెన్సిటివ్‌గా ఉండటమే’ అని అంటోంది హీరోయిన్‌ అదితీ రావ్‌ హైదరీ.
‘‘నేను చాలా సున్నితమనస్కురాలిని. కొన్ని విధాలుగా ఇది నాకు ఉపయోగం. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ మనస్తత్వం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. త్వరగా హర్ట్‌ అవుతాను. ఫీల్‌ అయిన విషయం నా ముఖం మీద కనిపించేస్తుంది. అలా నా ఫీలింగ్స్‌ని బయటపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. అయితే, అలా ఉండగలనో లేదో చూడాలి’’ అన్నారు.

 

ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీరు ఎవరి మీద ఆధారపడతారు? అని అడిగితే.. ‘‘ మనం మన మనసు చెప్పే మాటను వినాలి. మనసు చెప్పినది ఎంత కష్టమైనా దాన్ని యాక్సెప్ట్‌ చేయాలి. నమ్మకంతో ముందుకెళ్లాలి ’’ అని చెప్పింది అదితీ రావ్‌. ఆమె నటించిన హిందీ థ్రిల్లర్‌ ‘ది గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’ వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కానుంది.మణి రత్నం ‘పొన్నియున్ సెల్వం’, నాని ‘వి’ షూటింగ్ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: