టాలీవుడ్ లో ఇప్పుడు అగ్ర హీరోలు చాలా మంది చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అనేది వాస్తవం. ఈ మధ్య కాలంలో మార్కెట్ బాగా పెరుగుతున్న నేపధ్యంలో ప్రతీ హీరో కూడా నిర్మాతగా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్ ఇలా కొందరు ఇప్పుడు నిర్మాతలు గా మారే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. టాలీవుడ్ లో అగ్ర హీరోలు నిర్మాతలు గా మారడం తో చిన్న హీరోలు కూడా వారి తో సినిమాలు చేసి హిట్ అయితే ఫేం వస్తుంది అని భావిస్తూ వారితో సినిమాలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ప్రస్తుతం కొందరు స్టార్ హీరోలు చిన్న హీరోలతో సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నానీ విజయ్ దేవరకొండ తో సినిమాలు చెయ్యాలని చూస్తున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కూడా ఈ సినిమా మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. నానీ విజయ్ దేవరకొండ కలిసి గతంలో ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నానీని మళ్ళీ కలవలేదు. 

 

అయితే ఇప్పుడు మాత్రం వీరు కలిసి మరో సినిమా చేసే ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు ఎవరూ అనేది స్పష్టంగా తెలియకపోయినా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఈ సినిమా గురించి టాలీవుడ్ వర్గాలు కూడా ఎక్కువగానే చర్చలు జరుపుతున్నాయి. ఈ సినిమాకు ఒక ప్రముఖ దర్శకుడు నిర్మాత అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జన౦ అంటున్నారు. ఇప్పటికే కథ కూడా రెడీ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: