ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కోరిక తీరింది.  నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా రౌద్రం రణం రుధిరం లో  నుంచి  భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన వీడియోలో.. చరణ్ పాత్రధారి ‘అల్లూరి’ గురించి గ్రాండ్ ఎలివేషన్స్ షాట్స్ అండ్ భారీ విజువల్స్ అలాగే చరణ్ యాక్షన్ స్టంట్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి.  తెలుగు, హిందీ భాషల్లో ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్ ఇచ్చారు.  ‘ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది.. ఇంటి పేరు అల్లూరిసాకింది గోదారినా అన్న… మన్నెం దొర… అల్లూరి సీతారామ రాజు’ అంటూ ఎన్టీఆర్ పలుకుతున్న వాయిస్ వింటుంటే.. రామ్ చరణ్ చూస్తుంటే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.   

 

రాజమౌళి ఈ వీడియోతో ఫ్యాన్స్ ఆసక్తిని ఇంకా డబుల్ రెట్టింపు చేస్తూ అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.  ఎన్టీఆర్,  చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తుండగా, ఇప్పటికే చాలా వరకూ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఎన్టీఆర్చరణ్ ఇద్దరూ కూడా విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నారు.  తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ట్విస్ట్ ఏంటేంటే.. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ ఇద్దరు హీరోలు తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పనున్నారనేది తాజా సమాచారం.

 

కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్, లాక్ డౌన్ ఎత్తివేయగానే మొదలవుతుందని అంటున్నారు.  ఎన్టీఆర్ 'కొమరం భీమ్' రోల్ చేస్తుండగా రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో నటిస్తున్నారు. అయితే ఉగాది సందర్భంగా విడుదల చేసిన టైటిల్ కు అలాగే మోషన్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే పలువురు హాలీవుడ్ స్టార్స్ తో పాటు అజయ్ దేవగణ్, అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: