తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ  దర్వకత్వంలో నాగార్జున, అమల నటించిన ‘శివ’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించాడు నటుడు ఉత్తేజ్.  అచ్చమైన తెలంగాణ యాస మాట్లాడుతూ.. తెలంగాణ రామాయణం చెబుతూ చాలా ఫన్నీగా కనిపించాడు.  ఆ తర్వాత నటుడుగా, రచయితగా తెలుగు ఇంస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించాడు.  ఎన్నో విభిన్నమైన పాత్రలో ఉత్తేజ్ నటించాడు.  ఆయన కూతుళ్లు కూడా తెలుగు తెరపై నటించారు.  తాజాగా ఉత్తేజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడతూ.. నాకు పొగరు ఎక్కువ అనే టాక్ వున్నట్టుగా చెబుతున్నారు .. అలా అనుకునే వాళ్లకి నేను సమాధానం చెప్పను.

 

ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్లకి ఉంటుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కొంత మంది ప్రవర్తన అలాగే ఉంటుంది.. దానికి అందరినీ ఇదే తరహాలో భావిస్తుంటారు చాలా మంది. అయితే అది వాళ్ల మనస్తత్వాన్ని బట్టి.. వ్యక్తిత్వాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి, పెంపకాన్ని బట్టి  అతడు తిరుగుతున్న సర్కిల్ ని బట్టి ఇలా అంటుంటారు. అయితే దానికి నేను అస్సలు ఫీల్ కావడం లేదు అన్నారు. ఖాళీగా కూర్చుని అలా కామెంట్ చేసుకుంటూ పోయేవాళ్లకి, పనులు మానుకుని సమాధానాలు చెబుతూ కూర్చోవడం నా వల్ల కాదు. బిజీగా వుండి ఫోన్ ఎత్తకపోతే పొగరు అనుకునే వాళ్లకి ఏమని చెప్పగలం. 

 

ఇండస్ట్రీలో ఒక సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చాను.. నేన పొగరు గా ఉంటే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. అయినా ఇండస్ట్రీలో పొగరు గా ప్రవర్తిస్తే ఎవరూ దగ్గరికి కూడా రానివ్వరు.. ఇక్కడ ఎంత అనుకువగా ఉంటే అంత స్థాయికి ఎదుగుతారని అన్నారు. అయితే నా గురించి అనుకోనివ్వండి వాళ్ల దారి వాళ్లది .. నా తీరు నాది.  జీవితం నేర్పిన పాఠాల వలన నేను ఇలా అనుకోగలుగుతున్నాను అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: